కేంద్ర ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు మంత్రి హరీష్ రావు. సిద్ధిపేటలోని రెడ్డి భవన్ లో గీత కార్మికులకు గుర్తింపు కార్డులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న హరీష్ రావు కేంద్రంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ అభివృద్ధిని చూడలేకనే కేంద్రం ఇబ్బందులు పెడుతోందని ఆయన అన్నారు. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. రూ. 4 వేల కోట్లు జీఎస్టీ కింద రావాలని.. 15 వ ఆర్థిక సంఘం రూ. 6…
స్మార్ట్ సిటీ పేరుతో కేంద్రం ఇచ్చిన నిధులతో కరీంనగర్ లో ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేస్తోందని, టీఆర్ఎస్ ప్రభుత్వం సిగ్గు లేకుండా మళ్లీ కేంద్రం ఏమీ ఇవ్వడం లేదని విమర్శలు చేస్తోందని మండిపడ్డారు కరీంనగర్ ఎంపీ, బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్. టీఆర్ఎస్ నేతలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కరీంనగర్ లో నిన్న ప్రారంభోత్సవం చేసిన నిధులు ఎక్కడి నుండి వచ్చాయో సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిన్న టీఆర్ఎస్ నాయకులు సభలో ఏది మాట్లాడినా నడుస్తుందనుకుని…
14వ ఆర్థిక సంఘం కాలవ్యవధి ముగియడంతో వివిధ పంచాయతీలకు పాత నిధులు ఇవ్వలేం అంటూ కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యసభలో ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ జవాబులిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం బకాయిపడిన 529.96 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయలేమని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపినట్లు పంచాయితీ రాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ వెల్లడించారు. రాజ్యసభలో బుధవారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి…