ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోనూ అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం.. అధికారంలోకి వస్తాం అంటూ.. ప్రకటిస్తూ ఉంటారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్.. ఇక, అందరూ కలిసి రావాలి.. మా పార్టీలో చేరాలని అందరినీ ఆహ్వానిస్తూ ఉంటారు.. అంతే కాదు.. కాబోయే సీఎం నేనే..! కేంద్రంలో మంచి పోస్ట్ ఇస్తామన్నారు..! లాంటి స్టేట్‌మెంట్లూ కూడా చూస్తుంటాం.. అయితే, కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న తాజా నిర్ణయంతో ఆయనకు గట్టి షాక్ తగిలింది… దేశవ్యాప్తంగా క్రియాశీలంగా లేని 537…
Election Commission of India: ఎలాంటి కార్యకలాపాలు లేకుండా నిష్క్రియాపరంగా ఉన్న రాజకీయ పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ చర్యలకు ఉపక్రమించింది. మొత్తం 7 రాష్ట్రాల్లో 253 రాజకీయా పార్టీలు నిష్క్రియాపరంగా ఉన్నాయని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. వీటిలో 86 పార్టీల ఉనికి, మనుగడే లేదని ఓ ప్రకటనలో తెలిపింది. 253 రాజకీయ పార్టీలలో 66 పార్టీలు ఒకే ఎన్నికల గుర్తు కావాలని కోరి.. ఏ ఎన్నికల్లోనూ ఒక్క అభ్యర్థిని కూడా పోటీలో నిలపలేదని…
తెలంగాణలో ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన బండ ప్రకాష్ రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణలో ఓ రాజ్యసభ స్థానం ఖాళీ అయ్యింది. ఈ మేరకు ఉప ఎన్నిక నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది. మే 12న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. నామినేషన్‌ల దాఖలుకు చివరి తేదీ మే 19గా ఉంటుంది. మే 30న ఉప ఎన్నిక జరగనుంది. ఆ రోజు…
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయినట్లు సీఈసీ వెల్లడించింది. ఈ మేరకు వైఎస్‌ఆర్‌టీపీకి కేంద్ర ఎన్నికల సంఘం లేఖను పంపింది. తమ పార్టీ పేరును రిజిస్టర్ చేసినట్టుగా తమకు లేఖ అందినట్లు పార్టీ అధ్యక్షుడు వాడుక రాజగోపాల్ ప్రకటించారు. తమ పార్టీని రిజిస్టర్ చేయాల్సిందిగా కోరుతూ 28 డిసెంబరు 2020లో ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేశామని…
దేశంలో త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆంక్షలను సడలించింది. కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బహిరంగ సభలు, ఇండోర్ సమావేశాలు, ఇంటింటి ప్రచారాలను నిర్వహించుకోవచ్చని తెలిపింది. రోడ్ షోలు, పాదయాత్రలు, సైకిల్, బైక్, వాహనాల ర్యాలీలు, ఊరేగింపులపై గతంలో విధించిన నిషేధం వర్తిస్తుందని పేర్కొంది. Read Also: భారత్‌లో మరో కొత్త కల్చర్… ఇకపై వారానికొకసారి ఎన్నికల ప్రచారంలో…
దేశంలో కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ఎన్నికల సంఘం పొలిటికల్ ర్యాలీలు, రోడ్ షోలపై గతంలో నిషేధం విధించింది. తాజా ఆ నిషేధాన్ని జనవరి 31 వరకు పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అయితే తొలిదశలో ఎన్నికలు జరుపుకునే ప్రాంతాల్లో ఈ నెల 28 తర్వాత బహిరంగ సభలకు ఈసీ అనుమతి ఇచ్చింది. రెండో దశ…
త్వరలో దేశంలోని పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఒకపక్క కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. యూపీ సహా అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాలలో ర్యాలీలు, రోడ్ షోలపై ఎన్నికల కమిషన్ నిషేధం పొడిగించింది. గతంలో ఈనెల 15 వరకు నిషేధం విధించగా.. తాజాగా ర్యాలీలు, రోడ్‌షోలపై నిషేధాన్ని ఈనెల 22 వరకు పొడిగిస్తున్నట్లు శనివారం నాటి…
ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. తక్షణమే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తున్నట్టు ప్రకటించింది. ఐదు రాష్ట్రాల్లో 7 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ఎన్నికల కమిషన్ తెలియజేసింది. జనవరి 14 వ తేదీన యూపీలో తొలిదశ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు సీఈసీ తెలిపింది. తొలిదశ పోలింగ్ ఫిబ్రవరి 10న జరుగుతుంది. యూపీలో ఫిబ్రవరి 10, 14,23,27, మార్చి 3,7 వ తేదీన ఎన్నికలు జరగనుండగా, ఫిబ్రవరి 14 వ…
ఏపీలో ఓటర్ల లెక్కలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏపీలో మొత్తం 4,07,36,279 మంది ఓటర్లు ఉన్నట్లు సీఈసీ వెల్లడించింది. పురుష ఓటర్లు 2 కోట్ల ఒక లక్ష 34 వేల 664 మంది ఉండగా, మహిళా ఓటర్లు 2 కోట్ల 5 లక్షల 97 వేల 544 మంది ఉన్నారు. దీంతో పురుషుల కంటే 4,62,880 మంది మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నట్లు స్పష్టమైంది. మొత్తం ఓటర్లలో 4,06,61,331 మంది సాధారణ ఓటర్లు, 7,033 మంది…
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఓటర్ల జాబితా-2022ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా దాఖలైన అప్లికేషన్లను పరిష్కరించిన కేంద్ర ఎన్నికల సంఘం అనంతరం ఓటర్ల తుది జాబితాను ప్రకటించింది. ఈమేరకు తెలంగాణలో మొత్తం ఓటర్లు 3,03,56,894 మంది ఉన్నారని తెలియజేసింది. ఇందులో పురుష ఓటర్లు 1,52,56,474, మహిళా ఓటర్లు 1,50,98,685, ఇతర ఓటర్లు 1,735 మంది ఉన్నారు. ఓటర్ల జాబితాలో 18-19 ఏళ్ల మధ్య ఓటర్ల సంఖ్య 1,36,496గా ఉన్నట్లు కేంద్ర…