ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోనూ అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం.. అధికారంలోకి వస్తాం అంటూ.. ప్రకటిస్తూ ఉంటారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్.. ఇక, అందరూ కలిసి రావాలి.. మా పార్టీలో చేరాలని అందరినీ ఆహ్వానిస్తూ ఉంటారు.. అంతే కాదు.. కాబోయే సీఎం నేనే..! కేంద్రంలో మంచి పోస్ట్ ఇస్తామన్నారు..! లాంటి స్టేట్‌మెంట్లూ కూడా చూస్తుంటాం.. అయితే, కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న తాజా నిర్ణయంతో ఆయనకు గట్టి షాక్ తగిలింది… దేశవ్యాప్తంగా క్రియాశీలంగా లేని 537 రాజకీయ పార్టీల గుర్తింపును, వాటి గుర్తులను కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.. అందులో తెలంగాణ నుంచి రిజిస్టర్ అయిన 20 పార్టీలు కూడా ఉన్నాయి.. అవి.. 1. ఆల్ ఇండియా మహిళా డెమొక్రటిక్ ఫ్రంట్, 2. భారతీయ యువత, సమత, రా ష్ట్రీయత కాంగ్రెస్ పార్టీ, 3. నవ తెలంగాణ పార్టీ, 4. ప్రజా చైతన్య పార్టీ, 5. త్రిలింగ ప్రజా ప్రగతి పార్టీ, 6 అఖండ్ భారత్ నేషనల్ పార్టీ, 7. అఖిలాంధ్ర మహాదేశం, 8. ఆలిండియా ముక్తిదళ్ పార్టీ, 9. ఆలిండియా ముత్తహిద్ క్యుయామి మహాజ్, 10. ఆంధ్రప్రదేశ్ నవోదయ ప్రజాపార్టీ, 11. భారత్ అభ్యుదయ్ పార్టీ, 12. మన పార్టీ, 13. నేషనలిస్ట్ తెలంగాణ రాష్ట్ర సమితి, 14. ప్రజా భారత్ పార్టీ, 15. ప్రజా పార్టీ, 16. ప్రజాశాంతి పార్టీ, 17. తల్లి తెలంగాణ పార్టీ, 18. యూత్ డెమొక్రటిక్ ఫ్రంట్, 19, సెక్యులర్ డెమొక్రటిక్ లేబర్ ఆఫ్ ఇండియా, 20. సురాజ్ పార్టీ ఉన్నాయి.. ఈ జాబితాలో కేఏ పాల్‌కు చెందిన ప్రజాశాంతి పార్టీ కూడా ఉండడంతో.. ఆయనకు షాక్ తగిలినట్టు అయ్యింది.
Read Also: Cyber Crime: రూ.35 వేలతో ఏసీ కొనుగోలు.. ఖాతాలోని 27 లక్షలు మాయం..!
కాగా, కేంద్రం ఎన్నిక ల సంఘం దగ్గర కుప్పలు తెప్పలుగా పార్టీలు రిజిస్టర్ అయ్యాయి. అయితే అందులో చాలా పార్టీలు యాక్టివ్‌గా లేవు. కొన్ని ఎన్నికల సమయంలో మాత్రమే పనిచేస్తుంటే.. ఇంకా కొన్ని ఎన్నికల్లో కూడా పోటీ చేయడం లేదు. ఈ నేపథ్యంలో ప్రక్షాళన మొదలుపెట్టిన ఈసీ.. క్రియాశీలంగా లేని పార్టీలపై వేటు వేసింది.. దేశవ్యాప్తంగా క్రియాశీలంగా లేని 253 రాజకీయ పార్టీల గుర్తింపును, వాటి గుర్తులను రద్దుచేస్తున్నట్టు ప్రకటించింది.. మరోవైపు.. మనుగడలోని మరో 86 పార్టీలను ఎన్నికల సంఘం జాబితా నుంచి కూడా తొలగించేసింది.. తెలంగాణ నుంచి రిజిస్టర్ అయిన 20 పార్టీలు ప్రస్తుతం క్రియాశీలకంగా లేవని పేర్కొంది.. ఆయా పార్టీల గుర్తింపును రద్దు చేస్తున్నట్టు స్పష్టం చేసింది..