ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. తక్షణమే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తున్నట్టు ప్రకటించింది. ఐదు రాష్ట్రాల్లో 7 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ఎన్నికల కమిషన్ తెలియజేసింది. జనవరి 14 వ తేదీన యూపీలో తొలిదశ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు సీఈసీ తెలిపింది. తొలిదశ పోలింగ్ ఫిబ్రవరి 10న జరుగుతుంది. యూపీలో ఫిబ్రవరి 10, 14,23,27, మార్చి 3,7 వ తేదీన ఎన్నికలు జరగనుండగా, ఫిబ్రవరి 14 వ తేదీన పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి.
Read: ఐదు రాష్ట్రాల ఎన్నికలు: ఆ మూడు రాష్ట్రాల్లో ఎన్నికల వ్యయం పెంపుకు సీఈసీ గ్రీన్ సిగ్నల్…
మణిపూర్ అసెంబ్లీ నియోజక వర్గానికి ఫిబ్రవరి 27, మార్చి 3 వ తేదీల్లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10 వ తేదీన ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఫలితాలు వెలువడతాయని ఎన్నికల కమిషన్ తెలియజేసింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ఎన్నికల కమిషన్ తెలియజేసింది.