ఇరాన్‌లో నకిలీ ఉద్యోగ ఆఫర్లపై జాగ్రత్తగా ఉండాలంటూ భారతీయులకు కేంద్రం హెచ్చరించింది. క్రిమినల్ ముఠాలు తప్పుడు ఉద్యోగ హామీలతో వ్యక్తులను ఆకర్షించి కిడ్నాప్‌లకు పాల్పడుతున్నారని పేర్కొంది. ఇలాంటి తప్పుడు ప్రకటనలకు భారతీయులెవరూ బలికావొద్దని.. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని భారత విదేశాంగ కోరింది.