PM Modi: ఢిల్లీ యూనివర్సిటీని సందర్శించేందుకు మెట్రో ఎక్కిన ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ శుక్రవారం బయలుదేరారు. ఈ క్రమంలో ఢిల్లీ యూనివర్సిటీకి చేరుకునేందుకు మెట్రో రైలులో ప్రయాణించారు. భారీ భద్రత మధ్య మెట్రో రైలులో ప్రధాని మోడీ ఢిల్లీ యూనివర్సిటీకి బయలుదేరారు. అక్కడికి చేరుకున్న తర్వాత ప్రధాని మోదీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు. ఢిల్లీ యూనివర్సిటీ స్థాపించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రధాని మోడీ రోడ్డు మార్గంలో కాకుండా మెట్రోలో ఢిల్లీ యూనివర్సిటీకి బయలుదేరారు.
Also Read: France: ఫ్రాన్స్‌లో ఆగని అల్లర్లు.. పారిస్ శివారులో కర్ఫ్యూ విధింపు
Also Read
- Mahesh Babu: వారణాసి తర్వాత.. వాట్ నెక్స్ట్.?
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
- Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన తహసీల్దార్..
- ‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
ప్రధాని మోదీ గతంలో అమెరికా, ఈజిప్ట్‌లో పర్యటించి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత ప్రధాని మధ్యప్రదేశ్‌లో పర్యటించారు. అక్కడ వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ఇప్పుడు ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ మెట్రోలో ప్రయాణించారు.
ప్రయాణికులతో సంభాషించిన ప్రధాని
ఢిల్లీ యూనివర్శిటీకి తన మెట్రో ప్రయాణంలో, ప్రధాని మోదీ సాధారణ ప్రయాణికులతో కూడా సంభాషించడం కనిపించింది. ఈ సందర్భంగా మెట్రోలో ప్రయాణిస్తున్న ప్రజలతో ప్రధాని మోదీ ముచ్చటించారు. ప్రయాణికులతో సంభాషిస్తున్న సమయంలో అక్కడి వారితో కలిసి నవ్వుతూ కూడా కనిపించారు. మెట్రోలో యువతతో మాట్లాడుతున్నప్పుడు ప్రధాని మోదీ చాలా ఉత్సాహంగా కనిపించారు.
#WATCH | Prime Minister Narendra Modi travels in Delhi metro to attend the centenary celebrations of Delhi University. pic.twitter.com/s7r3DRSEba
— ANI (@ANI) June 30, 2023
తాజావార్తలు
-
Ram Charan New Movie: ఇదెక్కడి కాంబో మామ.. టెన్షన్ పడుతున్న ‘మెగా’ ఫాన్స్!
-
Mahesh Babu: వారణాసి తర్వాత.. వాట్ నెక్స్ట్.?
-
Udhampur Anti-Terror Operation: ఉధంపూర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
-
Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!