ఈ నాటికీ ఎంతోమంది కె.జె.ఏసుదాస్ మధురగానంతోనే నిదుర లేచి ఆనందిస్తూ ఉంటారు. ఆయన మాతృభూమి కేరళలోనే కాదు, యావద్భారతంలోకె.జె.ఏసుదాస్ మధురస్వరం వింటూనే రోజు ప్రారంభించే సంగీతాభిమానులు ఎందరో ఉన్నారు. నవంబర్ 14తో ఏసుదాస్ మధురగానానికి షష్టి పూర్తి. ఆయన తొలిసారి గానం చేసిన పాట రికార్డ్ అయింది. శ్రీనారాయణ గురు రాసిన జాతి భేదం... మత ద్వేషం... అంటూ సాగే ఆ పాటను సంగీత దర్శకులు ఎమ్.బి. శ్రీనివాసన్ , ఏసుదాస్ గళంలో కల్పదుకళ్* చిత్రం కోసం…