ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఎప్పుడైనా భారీ విధ్వంసం జరిగే అవకాశం ఉంది. అనేక రంగాల్లో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌కు విరామం లేదు. అయితే అమెరికా, అరబ్ దేశాలు కాల్పుల విరమణకు సంబంధించి ఇరాన్‌తో చర్చలు ప్రారంభించాయి. ఇజ్రాయెల్ నివేదిక ప్రకారం, మధ్యప్రాచ్యంలోని అన్ని రంగాలలో ఏకకాలంలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపడానికి అమెరికా, అరబ్ దేశాలు ఇరాన్‌తో బ్యాక్‌డోర్ చర్చలు ప్రారంభించినట్లు తెలిసింది.