ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎంతో విశ్వాసంతో శివుడికి అభిషేకం చేసే పాలలో ఓ వ్యక్తి ఉమ్మేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ పాలు కొనుగోలు చేసే లవ్ శుక్లా అనే వ్యక్తి సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఈ విషయాన్ని బట్టబయలు చేశారు. వాస్తవానికి.. లవ్ శుక్లా బంకే బిహారీ, కన్వర్ యాత్రల సమయంలో శంకర్జీ(శివుడు)కి అభిషేకం చేయడానికి ఈ పాలను ఉపయోగించేవాడని తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాలలో ఉమ్మి వేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
READ MORE: Minister Kollu Ravindra: ఐదేళ్ల పాటు అరాచకాలు చేసి.. ఈరోజు నీతులు చెబుతున్నారు!
వాస్తవానికి.. లక్నోలోని గోమతి నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివసిస్తున్న లవ్ శుక్లా కుటుంబానికి పప్పు అనే వ్యక్తి పాలు పంపిణీ చేసేవాడు. అతనిపై లవ్ శుక్లా స్పిట్ జిహాద్ ఆరోపణలు చేశారు. లవ్ శుక్లా కుటుంబం గోమతి నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పప్పు అనే వ్యక్తి అసలు పేరు మొహమ్మద్ షరీఫ్ అని తేలింది. తన పేరును మార్చుకుని ఈ ఘటనకు పాల్పడ్డాడని బట్టబయలైంది. ఈ అంశంపై వెస్ట్ జోన్ డీసీపీ శశాంక్ సింగ్ క్లారిటీ ఇచ్చారు. ఓ పాల వ్యాపారి పాలలో ఉమ్మివేసినట్లు వెలుగులోకి వచ్చిందని, దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిందితుడిపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
READ MORE: Viral Video: మ్యాచ్ మధ్యలో అకస్మాత్తుగా గ్రౌండ్‌లోకి వచ్చిన కుక్క.. (వీడియో)
మరోవైపు.. ఈ విషయం అఖిల భారత హిందూ మహాసభ సభ్యలకు తెలిసింది. కార్యకర్తలు వెంటనే పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. స్పిట్ జిహాద్ కు పాల్పడ్డ వ్యక్తులపై జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) విధించాలని అఖిల భారత హిందూ మహాసభ జాతీయ ప్రతినిధి శిష్య చతుర్వేది డిమాండ్ చేశారు. కన్వర్ యాత్ర జరుగుతోందని, ఈ సమయంలో శివుడికి అభిషేకించే పాలలో ఉమ్మి వేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Milkman Pappu, aka Mohammad Sharif, caught spitting in milk before delivering to Lov Shukla’s home in Lucknow.
CCTV footage exposed his vile betrayal, contaminating milk intended for children.
The Hindu Mahasabha and local residents stormed the police station, demanding severe… pic.twitter.com/kh1aZap9T2
— Treeni (@TheTreeni) July 5, 2025