అవినీతి ఆరోపణలపై సీబీఐ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అధికారిని అరెస్ట్ చేసింది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తో పాటు మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేసింది. గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్ లో నిందితులకు సంబంధించిన 11 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది సీబీఐ. రూ. 93 లక్షలతో పాటు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఇతరులతో కలిసి కుట్ర పన్నుతూ.. ప్రైవేట్ కంపెనీకి టెండర్లు కట్టబెడుతున్నారని ఆరోపణలు వచ్చాయి.…
రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లోత్ సోదరుడు అగ్రసేన్ గెహ్లోత్ ఇంట్లో శుక్రవారం ఉదయం సీబీఐ సోదాలు నిర్వహించింది. జోధ్‌పూర్‌లోని ఆయన ఇంటితో పాటు, ఆయన కార్యాలయాల్లో కూడా ఈ తనిఖీలు చేపట్టినట్లు సీబీఐ వర్గాలు వెల్లడించారు. తాజాగా వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈ తనిఖీలు జరిపినట్లు చెప్పాయి. కాగా అగ్రసేన్ గెహ్లాట్‌పై ఎరువుల ఎగుమతుల్లో అవకతవకల ఆరోపణలున్నాయి. గతంలో ఎరువుల కుంభకోణానికి సంబంధించి ఆయన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్…
వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరంపై సంచలన ఆరోపణలు చేశారు. చిదంబరంను ఓ ఆర్థిక ఉగ్రవాదిగా అభివర్ణించిన సాయిరెడ్డి.. ఆయనను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయ సాయిరెడ్డి వరుసగా 5 ట్వీట్లు సంధించారు. చిదంబరానికి అసలు నైతికతే లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. న్యాయ కళాశాలలు చిదంబరం వ్యవహారాలను కేస్ స్టడీలుగా తీసుకోవాలని తనదైన రీతిలో వ్యంగ్యాస్త్రాలు…
ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. దీంతో బెట్టింగ్ రాయుళ్లు కూడా భారీ ఎత్తున బెట్టింగులు పెడుతున్నారు. ఒక్కో మ్యాచ్ కు కొన్ని వందల కోట్లు చేతులు మారుతున్నాయి. అధికారులు బెట్టింగ్ ను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నా బెట్టింగ్ కు ఎండ్ కార్డ్ పడటం లేదు. తాజాగా హైదరాబాద్ క్రికెట్ బెట్టింగ్ పై సీబీఐ సోదాలు నిర్వహిస్తున్నారు. నగరంలోని నాలుగు చోట్ల సోదాలు చేశారు సీబీఐ అధికారులు. 2103 నుంచి పాకిస్తాన్ కేంద్రంగా ఈ బెట్టింగ్ వ్యవహారాన్ని గుట్టు చప్పుడు…
ఇవాళ తన ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలపై సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం… ఢిల్లీ, చైన్నైలలోని మా నివాసాల్లో సీబీఐ బృందం ఈ రోజు ఉదయం సోదాలు నిర్వహించిందన్న ఆయన.. సీబీఐ బృందం ఎఫ్ఐఆర్‌ను చూపించింది.. ఎఫ్.ఐ.ఆర్ లో నిందితుడిగా నా పేరు లేదన్నారు.. ఇక, సీబీఐ బృందానికి సోదాల్లో దొరికింది ఏమీ లేదన్నారు.. స్వాధీనం చేసుకుంది కూడా ఏమీ లేదన్న ఆయన.. ఈ…
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, శివగంగై సహా దేశ వ్యాప్తంగా ఏడు చోట్ల ఈ సోదాలు జరుగుతున్నాయి. తనయుడు కార్తీ చిదంబరంపై నమోదైన కేసులకు సంబంధించిన వ్యవహారంలో భాగంగానే ఈ సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. 2010 నుంచి 2014 మధ్య కాలంలో కార్తీ చిదంబం విదేశాలకు నగదు తరలించారని ఆరోపణలు ఉన్నాయి. కార్తీ చిదంబరం తన తండ్రి పి. చిదంబరం…
దేశవ్యాప్తంగా స్వచ్ఛంద సంస్థలపై ఏకకాలంలో దాడులు నిర్వహించింది సీబీఐ.. ఒకేసారి 40 చోట్ల దాడులు నిర్వహించాయి సీబీఐ అధికారుల బృందాలు… ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు 16 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించారు.. ముఖ్యంగా విదేశీ నిధులతో నడుస్తున్న స్వచ్ఛంద సంస్థల్లో సోదాలు జరిగాయి.. 14 మంది ఎన్జీవోల సంబంధించిన వారిని అరెస్టు చేసినట్టుగా తెలుస్తుండగా.. ఆరుగురు ప్రభుత్వం ఉద్యోగులను కూడా సీబీఐ అరెస్ట్ చేసినట్టు చెబుతున్నారు. స్వచ్ఛంద సంస్థల ముసుగులో పెద్దఎత్తున డబ్బులను రాబడుతోన్న వ్యవహారాలను కేంద్రం సీరియస్‌గా…
దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవరిస్తున్న స్వచ్ఛంద సంస్థలపై రైడ్స్ నిర్వహిస్తోంది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం నిబంధనలను ఉల్లంఘించి పలు స్వచ్ఛంద సంస్థలకు అనుమతులు ఇచ్చినందుకు సీబీఐ ఈ దాడులు నిర్వహిస్తోంది. ఎన్జీఓ సంస్థలు, వాటికి సంబంధించిన వ్యక్తులపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వేస్టిగేషన్ టీమ్ దాడులు చేస్తోంది. దేశ వ్యాప్తంగా 40 ప్రాంతాల్లో.. హైదరాబాద్, ఢిల్లీ, కోయంబత్తూర్, మైసూర్, రాజస్థాన్ ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(ఎఫ్సీఆర్ఏ) నిబంధనలు…