ఇవాళ తన ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలపై సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం… ఢిల్లీ, చైన్నైలలోని మా నివాసాల్లో సీబీఐ బృందం ఈ రోజు ఉదయం సోదాలు నిర్వహించిందన్న ఆయన.. సీబీఐ బృందం ఎఫ్ఐఆర్‌ను చూపించింది.. ఎఫ్.ఐ.ఆర్ లో నిందితుడిగా నా పేరు లేదన్నారు.. ఇక, సీబీఐ బృందానికి సోదాల్లో దొరికింది ఏమీ లేదన్నారు.. స్వాధీనం చేసుకుంది కూడా ఏమీ లేదన్న ఆయన.. ఈ సమయంలో సీబీఐ బృందం సోదాలు నిర్వహించడం ఆసక్తికరంగా ఉందంటూ ట్వీట్ చేశారు.
Read Also: Twitter handle blue tick: సీబీఐ మాజీ డైరెక్టర్‌కు హైకోర్టు జరిమానా..
కాగా, ఇవాళ ఉదయం పి.చిదంబరం ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించాయి.. ఢిల్లీ, ముంబై, చెన్నై, శివగంగై సహా దేశ వ్యాప్తంగా ఏడు చోట్ల ఈ సోదాలు జరిగాయి.. తనయుడు కార్తీ చిదంబరంపై నమోదైన కేసులకు సంబంధించిన వ్యవహారంలో భాగంగానే ఈ సోదాలు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. 2010 నుంచి 2014 మధ్య కాలంలో కార్తీ చిదంబం విదేశాలకు నగదు తరలించారని ఆరోపణలు వచ్చాయి.. కార్తీ చిదంబరం తన తండ్రి పి. చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు రూ. 305 కోట్ల మేరకు విదేశీ నిధులను స్వీకరించినందుకు INX మీడియాకు ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ (FIPB) క్లియరెన్స్‌కు సంబంధించిన కేసుతో సహా అనేక కేసుల్లో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే.
This morning, a CBI team searched my residence at Chennai and my official residence at Delhi. The team showed me a FIR in which I am not named as an accused.
The search team found nothing and seized nothing.
I may point out that the timing of the search is interesting.
— P. Chidambaram (@PChidambaram_IN) May 17, 2022