Unnao Rape Case: ఉన్నావ్ మైనర్ అత్యాచారం కేసులో దోషిగా తేలిన కుల్దీప్ సెంగర్‌కు సుప్రీంకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో 2017లో జరిగిన మైనర్ అత్యాచారం కేసులో దోషిగా తేలిన కుల్దీప్ సెంగర్‌కు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులను సోమవారం సుప్రీంకోర్టు నిలిపివేసింది. సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత, బాధితురాలు స్పందిస్తూ.. “సుప్రీంకోర్టు తీర్పు పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. సుప్రీంకోర్టు న్యాయం చేసింది. అయితే సెంగర్‌కు ఉరిశిక్ష పడేవరకు నా పోరాటం…