తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్ట్ అయిన వైఎస్ భాస్కర్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు.. షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.. ఈ నెల 30వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
Tara Shahdeo: జాతీయ స్థాయి షూటర్ తారా సహదేవ్ ‘లవ్ జిహాద్’ కేసులో సీబీఐ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. బలవంతపు మతమార్పిడి, ముస్లిం వ్యక్తి అయి ఉండీ హిందువుగా నటించి తారా సహదేవ్ ని పెళ్లాలడం, ఆ తరువాత బలవంతంగా మతం మారాలని ఒత్తిడి చేసిన కేసులో కీలక తీర్పును వెల్లడించింది.
వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ మేరకు వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ కోర్టు శుక్రవారం సమన్లు జారీ చేసింది. ఆగస్టు 14న కోర్టుకు హాజరు కావాలని వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి సమన్లు పంపింది సీబీఐ కోర్టు. వివేకా హత్య కేసులో అనుబంధ ఛార్జిషీట్ ను సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. CBI Court, YS Avinash Reddy, Viveka Case, telugu…
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఎర్ర గంగి రెడ్డి హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో లొంగిపోయారు. ఈ కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి కొంతకాలంగా బెయిల్‌పై బయట ఉన్నారు. తాజాగా తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో ఆయన సీబీఐ కోర్టులో లొంగిపోయారు.
నటి జియాఖాన్ మృతి కేసులో ముంబై సీబీఐ కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ఆమె ప్రియుడు, నటుడు సూరజ్ పంచోలీని నిర్దోషిగా న్యాయస్థానం ప్రకటించింది. సూరజ్ వల్లే జియాఖాన్ ఆత్మహత్యకు పాల్పడిందన్న ఆరోపణలకు తగిన సాక్ష్యాధారాల లేనందునా.. అతన్ని నిర్దోషిగా తేలుస్తూ విడుదల చేస్తున్నట్లు సీబీఐ కోర్టు న్యాయమూర్తి ఏఎస్ సయ్యద్ తీర్పు చెప్పారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి సీబీఐ కోర్టు న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌ను విధించారు. దీంతో ఆయనను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు.
YS Viveka murder case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది.. నిందితులను ఇవాళ ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చనున్నారు అధికారులు.. దీనికోసం కడప జైల్‌లో ఉన్న నిందితులు సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, దేవి రెడ్డి శివశంకర్ రెడ్డిలను ప్రత్యేక పోలీసు బందోబస్తు మధ్య ఈ తెల్లవారుజామున 4 గంటలకు కడప జైలు నుంచి హైదరాబాద్‌కు…
YS Viveka Murder Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ ముమ్మరం చేసింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.. వివేకా హత్య కేసులో విచారణ ప్రక్రియ ప్రారంభించిన సీబీఐ కోర్టు.. ఈ కేసులో ప్రధాన, అనుబంధ ఛార్జిషీట్‌ను విచారణకు స్వీకరించింది.. వైఎస్ వివేకా హత్య కేసుకు SC/01/2023 నంబర్ కేటాయించింది సీబీఐ స్పెషల్ కోర్టు.. ఇక, వైఎస్ వివేకా హత్య కేసులో ఐదుగురు నిందితులకు సమన్లు జారీ చేసింది.. ఈ…