Delhi Liquor Scam: స్పెషల్ కోర్టులో అభిషేక్ వేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhishek Boinapally Bail Petition Investigation In CBI Court: ఢిల్లీ లిక్కర్ స్కాంలో, మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న అభిషేక్ బోయినపల్లి.. సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. ప్రస్తుతం ఈ పిటిషన్‌పై వాదనలు కొనసాగుతున్నాయి. ఈడీ అధికారులు అభిషేక్‌ను నేరుగా కోర్టుకు తీసుకెళ్లకుండా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచారు. కాగా.. అభిషేక్ రిమాండ్ శనివారంతోనే ముగియగా, సీబీఐ స్పెషల్ కోర్టు మరో 21 రోజుల పాటు జ్యుడిషీయల్ రిమాండ్ పొడిగించింది. మరోవైపు.. ఢిల్లీ లిక్కర్ స్కాం, మనీలాండరింగ్ కేసులో ఈడీ శుక్రవారం సప్లిమెంటరీ చార్జ్‌షీట్ దాఖలు చేయగా.. దాని విచారణకు స్వీకరించడంపై ఈనెల 28న నిర్ణయం తీసుకుంటామని సీబీఐ స్పెషల్ కోర్టు తెలిపింది.
India vs Sri Lanka 2nd ODI: భారత బౌలర్ల ధాటికి శ్రీలంక చిత్తు.. 215 పరుగులకి ఆలౌట్
Also Read
కాగా.. శుక్రవారం ఈడీ దాఖలు చేసిన 13,567 పేజీల చార్జ్‌షీట్‌లో ఐదుగురు నిందితులు, ఏడు కంపెనీలపై అభియోగాలు మోపినట్లు ఈడీ తరఫు న్యాయవాది నవీన్ కుమార్ తెలిపారు. ఇందులో రాబిన్ డిస్టిలరీస్ డైరెక్టర్ అభిషేక్, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, ఇండో స్పిరిట్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ మహేంద్రు, ఆప్ కమ్యూనికేషన్ ఇన్చార్జ్ విజయ్ నాయర్, బిజినెస్ మెన్ బినోయ్ బాబు, అమిత్ అరోరా పేర్లను ప్రస్తావించినట్లు వెల్లడించారు. దీనిపై జడ్జి నాగ్‌పాల్ స్పందిస్తూ.. సప్లిమెంటరీ చార్జ్ షీట్‌ను పరిగణలోకి తీసుకునే అంశంపై ఈ నెల 28న విచారణ జరుపుతామన్నారు. అలాగే, శరత్ చంద్రా రెడ్డి వేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణను జనవరి 20కి వాయిదా వేసింది. అటు.. నవంబర్ 26న ఈడీ దాఖలు చేసిన తొలి చార్జ్ షీట్లో మహేంద్రును ఏ1గా, ఏ2, ఏ3, ఏ4, ఏ5గా ఆయనకు సంబంధించిన నాలుగు కంపెనీలను చేర్చింది. దీంతో రెండు చార్జ్ షీట్‌లలో కలిపి నిందితుల సంఖ్య 17కు చేరింది.
Maalika Puram: అల్లు అరవింద్ చేతికి మరో సూపర్ హిట్ మూవీ రైట్స్!
తాజావార్తలు
-
UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
-
Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
-
Jayant C Paranjee: ఆడదని ముందే తెలుసు.. పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
-
Gandhi Jayanti 2026: గాంధీ జయంతి.. రాజ్‌ఘాట్‌లో బాపూజీకి ప్రధాని మోడీ ఘన నివాళులు
-
Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?