వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ మేరకు వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ కోర్టు శుక్రవారం సమన్లు జారీ చేసింది. ఆగస్టు 14న కోర్టుకు హాజరు కావాలని వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి సమన్లు పంపింది సీబీఐ కోర్టు. వివేకా హత్య కేసులో అనుబంధ ఛార్జిషీట్ ను సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి,ఉదయ్ కుమార్ రెడ్డిపై ఛార్జిషీట్ వేసింది. వివేకా హత్య కేసులో 8వ నిందితుడిగా సీబీఐ అవినాష్ రెడ్డిని చేర్చింది.
Also Read : IndvsWI: రికార్డుల కోసమే వెస్టిండీస్ తో మ్యాచ్ ఆడుతున్నట్లు కనిపిస్తుంది..
ఇదిలా ఉంటే.. వైఎస్ అవినాష్ రెడ్డి జూన్ 18న ఆదివారం అయినప్పటికీ సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఒక్కరోజు ముందు నోటీసులిచ్చి విచారణకు రావాలంటూ సీబీఐ నోటీసులు ఇవ్వడంతో మరుసటిరోజు ఉదయం 10.30 గంటలకు సీబీఐ కార్యాలయం అవినాష్ రెడ్డి వచ్చారు. అయితే.. కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ ను అధికారులు సమర్పించి 20 నిమిషాల్లోనే సీబీఐ కార్యాలయం నుంచి వెనుదిరిగారు అవినాష్ రెడ్డి.
Also Read : IndvsWI: రికార్డుల కోసమే వెస్టిండీస్ తో మ్యాచ్ ఆడుతున్నట్లు కనిపిస్తుంది..
అయితే… జూన్ నెల చివరి వరకు.. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీబీఐ విచారణకు హాజరు కావాలని అవినాష్‌ను ఆదేశించింది న్యాయస్థానం. అవినాష్ ముందస్తు బెయిల్ పొందిన తరువాత నాలుగోసారి సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే వైఎస్ వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.