Cauvery Water Dispute: తమిళనాడుకు కావేరీ నదీ జలాల విడుదలకు వ్యతిరేకంగా కర్ణాటకలో నిరసనలు కొనసాగుతున్నాయి. వీటన్నింటి మధ్య శుక్రవారం కర్ణాటక బంద్‌కు పిలుపునిచ్చారు.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జనతాదళ్ (సెక్యులర్) నాయకుడు హెచ్‌డీ కుమారస్వామి బుధవారం బెంగళూరులో కావేరీ నీటి సమస్యపై కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.
కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల మధ్య మరోసారి కావేరీ నదీ జలాల వివాదం రాజుకుంది. తమిళనాడుకు కావేరీ నది నీటిని విడుదల చేయొద్దంటూ బెంగళూరు వ్యాప్తంగా కర్ణాటక జలసంరక్షణ సమితి, వివిధ రైతుసంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో మరోసారి కావేరీ నదీ జలాల వివాదం తెరమీదకు వచ్చింది. అసలు ఈ వివాదం ఏంటి.. ఎప్పుడు ప్రారంభమైందంటే..