క్యాసినో వ్యవహారంలో ఈడీ నిర్వహించిన సోదాల్లో మాధవరెడ్డి కారుకు మంత్రి మల్లారెడ్డి స్టిక్కర్ ఉండటం సంచలనంగా మారింది. దీంతో.. మంత్రి మల్లారెడ్డి స్పందించారు. ఆ స్టిక్కర్ నాదే కానీ.. దాంతో నాకు ఎటువంటి సంబంధం లేదని అన్నారు. నగరంలోని బోడుప్పల్ ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు అందజేసిన అనంతరం మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. అయితే.. మాధవ రెడ్డి కారుకు ఉన్న స్టిక్కర్ తనదేనన్న మల్లారెడ్డి, అది 2022 మార్చి నాటిదని చెప్పారు. ఈనేపథ్యంలో..…
చిక్కోడి ప్రవీణ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. క్యాసినో వ్యవహారంలో ఈడి సోదాలు ముగిసాయి. అయితే.. Ed సోదాల్లో హవాలా లావాదేవీలు బయట పడ్డాయి. కొంతమంది ప్రముఖుల డబ్బులను హవాలా రూపంలో విదేశాలకు తరలించినట్లుగా ఈడీ గుర్తించింది. మొత్తం 8 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ప్రవీణ్ చికోటి, మాధవ రెడ్డి ఇళల్లో తెల్లవారుజామున వరకు ఈడి సోదాలు నిర్వహించారు. సుమారు 20 గంటల పాటు సోదాలు నిర్వహించింది. తెలంగాణ లో సైదాబాద్, బోయిన్ పల్లీ, కడ్తల్…
ఏపీలో మరోసారి క్యాసినో పాలిటిక్స్ బహిర్గతం అయ్యాయి. గతంలో గుడివాడలో క్యాసినో నిర్వహించారని టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. తాజాగా కృష్ణా జిల్లాలో మరోసారి క్యాసినో కలకలం రేగింది. ఓ గోవా కంపెనీ గెట్ టుగెదర్ పేరుతో పార్టీ నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. కాక్‌టైల్ డిన్నర్, సినీ హీరోయిన్‌ల స్టెప్పులు, సింగర్ల పాటలు, మధురమైన అనుభూతి ఉంటుందని నిర్వాహకులు ప్రచారం చేశారు. దీని కోసం ఆకర్షణీయమైన ఆహ్వాన పత్రాలను పంపారు. భారీ ఏర్పాట్లతో హోరెత్తించారు. కానీ…
కృష్ణా జిల్లా గుడివాడలో కేసినో వ్యవహారంపై ఇంకా రచ్చ కొనసాగుతూనే ఉంది.. ఈ వ్యవహారం వైసీపీ, టీడీపీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనిపిస్తోంది… ఘాటు విమర్శలు, ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉండగా.. మరోవైపు ఫిర్యాదులు కూడా వెళ్తున్నాయి.. ఇప్పటికే ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిసి ఫిర్యాదు చేసింది టీడీపీ.. ఇక, డీజీపీ, కలెక్టర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు టీడీపీ నేతలు.. మరోవైపు.. ఈ వ్యవహారంపై గవర్నర్‌కు లేఖ రాశారు టీడీపీ అధినేత…
ఏపీలో హాట్ టాపిక్ గా మారిన క్యాసినో వ్యవహారంలో టీడీపీ నేతలు చాలా సీరియస్ గా వున్నారు. గుడివాడ కేసినో పై చంద్రబాబుకి నివేదిక అందచేశారు. గుడివాడలో కేసినో నిర్వహణపై రూపొందించి సమగ్ర నివేదికను గవర్నరుకి అందచేస్తాం. గవర్నర్ రేపు, ఎల్లుండిలో సమయమిస్తే ఆయనకు క్యాసినో నిర్వహణపై అన్ని సాక్ష్యాలతో ఫిర్యాదు చేస్తాం అన్నారు వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర. క్యాసినో జరిగింది వాస్తవం, పోలీసులు దర్యాప్తు చేసేందుకు ఎందుకో విముఖంగా ఉన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు…
తనపై వస్తున్న విమర్శలపై మంత్రి కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. తాను రాజీనామా చేయనని, చంద్రబాబుని రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. క్యాసినోలపై ఏపీలో రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు వస్తే క్యాసినోలో ఏం జరిగిందో చూపిస్తానన్నారు.
సంక్రాంతి సందర్భంగా కృష్ణా జిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నాని క్యాసినో నిర్వహించారని రెండు రోజులుగా టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే గుడివాడలో క్యాసినో వ్యవహారంపై దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించాడు. గుడివాడ ఆధునీకరణకు శ్రీకారం చుట్టిన మంత్రి కొడాలి నానికి తాను పూర్తిగా మద్దతు తెలుపుతున్నానని… క్యాసినోకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారంతా పూర్వీకులు అని.. వారికేం తెలియదని వర్మ సెటైర్లు…
క్యాసినో లో క్రికెట్ బెట్టింగ్ బయటపడింది. అమ్మాయిల చే కాల్ చేయించి ఆకర్షిస్తున్నారు బుకీలు. టెలిగ్రామ్ ద్వారా వేలమందితో గ్రూపు ఏర్పాటు చేస్తున్నార బుకీలు. ముందుగా అమ్మాయిలను గ్రూపులో చేర్చి ఆకర్షిస్తున్నారు బుకీలు. అమ్మాయిలు నేపాల్ నుంచి తెచ్చి ఈ పనులు చేస్తుంది ముఠా. దీని పై సీపీ మహేష్ భగవత్ మాట్లాడుతూ… ఆన్ లైన్ లో క్యాసినో కి మన దగ్గర అనుమతి లేదు. మల్కాజ్ గిరి లో ఆన్ లైన్ బెట్టింగ్ రాకెట్ ను…