క్యాసినో లో క్రికెట్ బెట్టింగ్ బయటపడింది. అమ్మాయిల చే కాల్ చేయించి ఆకర్షిస్తున్నారు బుకీలు. టెలిగ్రామ్ ద్వారా వేలమందితో గ్రూపు ఏర్పాటు చేస్తున్నార బుకీలు. ముందుగా అమ్మాయిలను గ్రూపులో చేర్చి ఆకర్షిస్తున్నారు బుకీలు. అమ్మాయిలు నేపాల్ నుంచి తెచ్చి ఈ పనులు చేస్తుంది ముఠా. దీని పై సీపీ మహేష్ భగవత్ మాట్లాడుతూ… ఆన్ లైన్ లో క్యాసినో కి మన దగ్గర అనుమతి లేదు. మల్కాజ్ గిరి లో ఆన్ లైన్ బెట్టింగ్ రాకెట్ ను అరెస్ట్ చేశారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు. కిరణ్, అహమ్మద్, సురేందర్ రెడ్డి నిందితులుగా ఉన్నారు. 53 లక్షల నగదు సీజ్ చేసాము. 21, లక్షల నగదు ఆక్సిస్ బ్యాంక్ లో ఫ్రీజ్ చేసారు. 1xbet,Betfair, world 777 ప్లాట్ ఫాం ద్వారా బుకింగ్ అవుతుంది. 70-30 శాతంలో బుకింగ్ జరుగుతుంది. స్పోర్ట్స్ బుక్, ఆన్ లైన్ పోకర్, ఆన్ లైన్ బింగో అనే వెబ్ సైట్లు కూడా గుర్తించాం. వీళ్ళు బుకి,సబ్ బుకీలగా పని చేస్తున్నారు.
నలుగురు అమ్మాయిలని ఇక్కడ ఒక రూమ్ లో ఉంచి.. టెలిగ్రాం ద్వారా అందరితో కాంటాక్ట్ అయ్యేలా చేస్తారు. ఈ అమ్మాయిలు నేపాల్ నుంచి వచ్చారు. ఇది యూ.కే నుంచి అకౌంట్ తీసుకోని యూజర్ పేరు, పాస్ వర్డ్ ఇక్కడ ఆడే వారికి ఇస్తారు. శ్రీ నిధి అనే ఒక కంపెనీ పేరుతో ఒక ఫేక్ కంపెనీ బెంగళూరు లో చేశారు. డబ్బులు ట్రాన్స్ఫర్ మొత్తం ఆ కంపెనీ అకౌంట్ ద్వారా చేస్తారు. హైదరాబాద్ లో ఫేక్ కంపెనీ పెట్టడం కష్టం అవుతుంది అని బెంగళూరు లో పెట్టారు. కిరణ్ అనే వ్యక్తి బయట దేశాలకి వెళ్ళి ఈ ఆట గురుంచి తెలుసుకొని వచ్చాడు. 1000 మంది వీళ్ళ చేతిలో మోసం చేశారు. 2018 నుంచి ఈ మోసాలు జరుగుతున్నాయి ఈ ఆట లో ఫుట్ బాల్, క్యాసినో లో పాయింట్స్ రూపంలో లావాదేవీలు జరుగుతున్నాయి.