చాలా మంది యువత ఉపాధి కోసమనో.. లేదంటే చదువుల కోసమనో విదేశాలకు వెళ్తుంటారు. తమ పిల్లల భవిష్యత్ కోసం తల్లిదండ్రులు కూడా వారిని విదేశాలకు పంపించడంలో వెనుకాడటం లేదు. లక్షలు లక్షలు ఖర్చు చేసి మరీ పంపిస్తున్నారు. అయితే గత కొద్దిరోజులుగా విదేశాలకు వెళ్లిన పంజాబ్ రాష్ట్రానికి చెందిన యువత గుండె జబ్బుల బారిన పడుతున్నారు.
చైనాలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. జూన్ మాసంలో అదికాస్త గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. జూన్ చివరి వారం కల్లా దాదాపు 6.5 కోట్ల మంది ఈ వ్యాధి బారినపడే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరించారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన కోనసీమ అల్లర్ల కేసు లో అమాయకులు బలి అవుతున్నారా? తమ ఫెయిల్యూర్ లని కప్పి పుచ్చుకోవడానికి పోలీసులు దొరికిన వాళ్ళ పై కేసులు పెడుతున్నారా? అసలు ఊళ్ళో లేని వారి పై కేసులు ఎలా పెడతారు? వాటి గురించి పోలీసులు ఏమంటున్నారు? ఇప్పుడిదే కోనసీమలో హాట్ టాపిక్ అవుతోంది. కోనసీమ జిల్లా కి అంబేద్కర్ పేరు పెట్టవద్దని ఈ నెల 20 న అమలాపురంలో భారీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.పోలీసులు కూడా…
వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరంపై సంచలన ఆరోపణలు చేశారు. చిదంబరంను ఓ ఆర్థిక ఉగ్రవాదిగా అభివర్ణించిన సాయిరెడ్డి.. ఆయనను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయ సాయిరెడ్డి వరుసగా 5 ట్వీట్లు సంధించారు. చిదంబరానికి అసలు నైతికతే లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. న్యాయ కళాశాలలు చిదంబరం వ్యవహారాలను కేస్ స్టడీలుగా తీసుకోవాలని తనదైన రీతిలో వ్యంగ్యాస్త్రాలు…
దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న దేశద్రోహం కేసులపై ఇవాళ దేశ అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. దేశద్రోహ నేరాన్ని నేరంగా పరిగణించే IPCలోని సెక్షన్ 124Aలోని నిబంధనలను పునఃపరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అనుమతి మంజూరుచేసింది. ఈ కేసులకు సంబంధించిన పునఃపరీక్ష పూర్తయ్యే వరకు 124ఏ కింద ఎలాంటి కేసు నమోదు చేయరాదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. దేశద్రోహ చట్టాన్ని నిలిపివేయాలని సీజే ఎన్వీ రమణ ఇప్పటికే అభిప్రాయపడుతున్నారు. దేశద్రోహం కేసుపై ఇవాళ కూడా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. బిక్కవోలు మండలం బలభద్రపురంలో గ్రాసిం ఇండస్ట్రీ కోర్ ఆల్కలీ యూనిట్‌ను బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లాతో కలిసి ప్రారంభించారు… అనంతరం కీలక ప్రకటన చేశారు.. 131 మంది ఉద్యమకారులపై కేసులు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు సీఎం వైఎస్ జగన్.. గతంలో బలభద్రపురంలో కాలుష్య పరిశ్రమ వద్దంటూ కేపీఆర్ వ్యతిరేక ఉద్యమం జరిగింది.. ఈ సందర్భంగా 131 మందిపై…
గత కొంతకాలంగా మళ్లీ కరోనా పంజా విసురుతోంది.. అన్ని రాష్ట్రాలు క్రమంగా కేసులు పెరుగుతున్నాయి.. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి.. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.. కేసులను వర్చువల్ విధానంలో విచారించాలని నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది.. కరోనా వ్యాప్తి ఎక్కువ అవుతున్న నేపథ్యంలో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నామని.. సంక్రాంతి పండుగ సెలవుల తర్వాత నుంచి అంటే ఈ నెల 17వ తేదీ నుంచి వర్చువల్ విధానంలోనే…
హైదరాబాద్‌లో అత్యంత ప్రముఖులు ఉండే ఏరియాలో ఆయన పోలీస్ అధికారి. ఓ మంత్రి రికమండేషన్‌తో వచ్చారట. ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఓ రేంజ్‌లో వసూళ్లే వసూళ్లు. సమస్య ఏదైనా ఆయన లెక్క వేరని కథలు కథలుగా చెప్పుకొనే పరిస్థితి ఉందట. మంత్రి రికమండేషన్‌తో హైదరాబాద్‌లో ఏసీపీగా రాక..!పోలీస్ శాఖలో హైదరాబాద్ పరిధిలో పోస్టింగ్ అంటే కానిస్టేబుల్ నుంచి అధికారుల వరకు ఒక క్రేజ్ ఉంటుంది. పైరవీలు చేసేవాళ్లూ ఎక్కువే. హోదాలను బట్టి ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి రికమండేషన్లు…
ఏపీలో హాట్ టాపిక్ అవుతున్న మూడురాజధానుల అంశం కీలక మలుపు తీసుకుంది. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ విషయాన్ని న్యాయస్ధానానికి అడ్వకేట్ జనరల్ తెలిపారు. మూడు రాజధానులు బిల్లు అంశంపై ఏపీ హైకోర్టులో గత కొద్దిరోజులుగా విచారణ జరుగుతోంది. నేటి వాదోపవాదాల్లో భాగంగా మూడు రాజధానుల బిల్లు ఉపసంహటించుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు అడ్వకేట్ జనరల్. ఇదే అంశంపై ఏపీ సచివాలయంలో అత్యవసర కేబినెట్ సమావేశం జరుగుతోంది. మూడు…