అమరావతి రాజధాని కేసులపై హైకోర్టులో విచారణ ప్రారంభం అయింది. రాజధాని కేసుల నుంచి న్యాయమూర్తులు సత్యనారాయణ మూర్తి, సోమయాజులను తప్పించాలని ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్యంత్ దవే పిటిషన్ వేశారు. రాజధానిలో ఆ ఇద్దరు న్యాయమూర్తులకు భూములున్నాయని.. వారిని ధర్మాసనం తప్పించాలని కోరారు దుష్యంత్ దవే. గతంలో ఇవే పిటిషన్లపై విచారణ చేపడుతోన్నప్పుడు ఎందుకు అభ్యంతరం తెలపలేదని హైకోర్టు ప్రశ్నించింది. న్యాయమూర్తులపై ప్రభుత్వ అభ్యంతర పిటిషన్‌ని కొట్టేసింది హైకోర్టు. తాము అభ్యంతరం తెలిపామనే విషయాన్ని తీర్పులో ప్రస్తావించాలని…
ఏపీ రాజధానికి సంబంధించిన కేసులపై హైకోర్టు ఇవాళ విచారణ జరపనుంది . సీఆర్డీ యే రద్దు చట్టం , పాలనా వికేంద్రణ లపై దాఖలైన పిటీషన్లపై త్రిసభ్య ధర్మాసనం రోజువారీ విచారణ కొనసాగించనుంది. ప్రస్తుతం 90కి పైగా పిటీషన్లు దాఖలు చేశారు . ఈ ఏడాది ఆగస్టులో విచారణ జరిపిన ధర్మాసనం నేటికి వాయిదా వేసింది. రాజధాని తరలింపు, పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టంపై దాఖలైన వ్యాజ్యాలపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. రైతులు, నేతలు…
ప్రపంచంలో కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్లీ ఉగ్రరూపం దాల్చుతోంది. అమెరికాలో ప్రతిరోజూ లక్షన్నరకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇందులో సింహభాగం కేసులు డెల్టావేరియంట్ కేసులు ఉండటంతో ఆ దేశం అప్రమత్తం అయింది. వ్యాక్సినేషన్‌ను వేగంగా అమలు చేస్తున్నప్పటికీ కేసులు పెరిగిపోతుండటంతో నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. మాస్క్‌ను తప్పనిసరి చేశారు. మరోవైపు విజయవంతంగా ఒలింపిక్స్‌ను నిర్వహించిన జపాన్‌లో కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ప్రతిరోజూ 20 వేలకు పైగా కేసులు నమోదవుతుండటంతో 12 ప్రాంతాల్లో ఎమర్జెన్సీ…
ప్రపంచంలో కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. తగ్గిందిలే అనుకుంటున్న సమయంలో తిరిగి కరోనా విజృంభిస్తుండటంతో అన్నిదేశాలు బెంబెలెత్తిపోతున్నాయి. సోమవారం రోజున యూఎస్‌లో ఏకంగా లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. వ్యాక్సిన్ వేగంగా అమలు చేస్తున్నప్పటికీ కేసులు పెరుగుతుండటం భయాందోళనలు కలిగిస్తోంది. అమెరికాలోని ఆర్కాన్సన్ రాష్ట్రంలో అత్యధిక కేసులు, ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతున్నది. సోమవారం రోజున ఆ రాష్ట్రంలో 1376 మంది ఆసుపత్రుల్లో చేరారు. ఇక అమెరికా తరువాత అత్యధిక కేసులు ఇరాన్‌లో నమోదవుతున్నాయి. సడలింపులు…
విశాఖ జిల్లా పెందుర్తి మండలం జుత్తాడలో హత్యకు గురైన ఆరుగురి మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తి కాలేదు. తన కుటుంబాన్ని అత్యంత కిరాతకంగా హత్య చేసిన అప్పల రాజుతో పాటు అతనికి సహకరించిన మరో ఆరుగురిని అదుపులోకి తీసుకుంటేనే పోస్ట్‌మార్టానికి అంగీకరిస్తామని అంటున్నాడు బాధితుడు విజయ్, అతని బంధువులు. బత్తిన అప్పలరాజుతోపాటు దుర్గాప్రసాద్, గౌరీష్, శ్రీనులను కూడా శి్‌క్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. విశాఖ మార్చురీ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జుత్తాడ శెట్టిబలిజ వీధికి చెందిన బత్తిన అప్పలరాజుకు,…