దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న దేశద్రోహం కేసులపై ఇవాళ దేశ అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. దేశద్రోహ నేరాన్ని నేరంగా పరిగణించే IPCలోని సెక్షన్ 124Aలోని నిబంధనలను పునఃపరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అనుమతి మంజూరుచేసింది. ఈ కేసులకు సంబంధించిన పునఃపరీక్ష పూర్తయ్యే వరకు 124ఏ కింద ఎలాంటి కేసు నమోదు చేయరాదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. దేశద్రోహ చట్టాన్ని నిలిపివేయాలని సీజే ఎన్వీ రమణ ఇప్పటికే అభిప్రాయపడుతున్నారు.
దేశద్రోహం కేసుపై ఇవాళ కూడా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దేశద్రోహం కేసులను రిజిస్టర్ చేసేందుకు ఎస్పీ ర్యాంక్ అధికారికి బాధ్యతను అప్పగించనున్నట్లు సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది.ఇప్పటికే దాఖలైన కేసులను హోల్డ్‌లో పెట్టాల్సిన అవసరం లేదని కోర్టు చెప్పింది. భవిష్యత్తులో ఎఫ్ఐఆర్‌లు నమోదు చేస్తున్న సమయంలో ఆ కేసులో దేశద్రోహ ఆరోపణలు చేయాలా వద్దా అన్న అంశాన్ని ఎస్పీ ర్యాంక్ లేదా అంతకన్నా పైస్థాయి అధికారి చూసుకుంటారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు.
దేశంలో అమలవుతున్న దేశద్రోహ చట్టాన్ని పున సమీక్షిస్తామని కేంద్రం ఈమధ్యే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం విచారణలో ఉన్న కేసులను పెండింగ్‌లో పెట్టాలా లేదా అని కోర్టు కేంద్రాన్ని అడిగిన విషయం తెలిసిందే. అయితే పెండింగ్ కేసులను హోల్డ్‌లో పెట్టాల్సిన అవసరం లేదని తుషార్ మెహతా చెప్పారు. దేశద్రోహ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించవచ్చునని సుప్రీం తెలిపింది.
మానవ హక్కులు, దేశ సమగ్రత మద్య సమతుల్యతను పాటించాల్సిన అవసరం ఉందని తెలిపింది సిజెఐ ధర్మాసనం. హనుమాన్ ఛాలీసా పఠించినప్పుడు 124ఎ కింద కేసులు నమోదు చేయడాన్ని అటార్నీ జనరల్ తప్పు పట్టారు.పిటిషనర్లు కూడా ఇది వలసవాద చట్టంగా పేర్కొన్నారు.
Afghanistan: ఆఫ్ఘన్ లో దుర్భర పరిస్థితులు… సగం మంది జనాభాకు తిండికి తిప్పలు