ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. కేటీఆర్‌తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌పై కేసు నమోదు చేశారు. A-1గా కేటీఆర్, A-2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A-3గా హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిని చేర్చింది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని ఏసీబీ కేసు నమోదు చేసింది.
మహారాష్ట్రలోని థానేలో ట్రిపుల్ తలాక్ కేసు వెలుగు చూసింది. తన భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పి రూ.4 లక్షల కోసం వేధించినందుకు ఓ వ్యక్తితో పాటు అతని కుటుంబానికి చెందిన మరో నలుగురిపై థానే పోలీసులు కేసు నమోదు చేశారు.