ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ ఆకుల వెంకట శేషశాయి, జస్టిస్ సుమతి ధర్మాసనం ముందు విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా ఎస్జీటీ టీచర్ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను కూడా అనుమతించడo సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకం అని పిటిషనర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ తెలిపారు.
ఏపీ హైకోర్టులో నేడు కీలక కేసుల విచారణ జరగనుంది. కోవిడ్ పరిస్థితులు, ప్రభుత్వ చర్యలపై దాఖలైన 5 పిటిషన్ల పై విచారణ జరపనుంది కోర్టు. అలాగే రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక సంభవించిన 11 మరణాలు , అనంత ఆసుపత్రిలో 12 మరణాలపై సుమోటో కేసులుగా స్వీకరించి విచారణ చేయనుంది. అంతేకాకుండా సంగం డైరీ చైర్మన్ ధూళిపాళ్ల, ఎండి గోపాల కృష్ణ బెయిల్ పిటిషన్ల పై విచారణ చేయనుంది హైకోర్టు. చూడాలి మరి ఈ కేసులో ఏ…