విశాఖలోని ఆర్కే బీచ్ రోడ్డులో అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది… అతివేగంగా వెళ్తు బైక్ పై వెళ్తున్న యువకుడిని ఢీకొట్టారు.. గాయపడ్డ యువకుడిని ఆస్పత్రికి తరలించగా.. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.. ప్రమాద సమయంలో కారులో నలుగురు యువకులు ఉన్నట్టుగా చెబుతున్నారు స్థానికులు.. అంతేకాదు.. కారులో మద్యం బాటిల్స్ కూడా లభించాయి.. దీంతో.. మద్యం సేవించి.. ఇష్టం వచ్చినట్టుగా కారు నడిపి.. ప్రమాదానికి కారణం అయినట్టుగా భావిస్తున్నారు.. Read Also: Gold Rate Today:…
తెలుగు రాష్ట్రాల్లో గంజాయి, డ్రగ్స్ రాజ్యమేలుతున్నాయి. ఎక్కడ చూసినా.. ఎక్కడ తనిఖీలు చేసినా గంజాయి గుప్పుమంటోంది. తాజాగా ఓ ప్రమాదంలో గంజాయి బయటపడడంతో అంతా అవాక్కయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గోదావరి బ్రిడ్జి సమీపంలో ఒక ప్రమాదం జరిగింది. అదుపు తప్పి పల్టీ కొట్టింది ఓ కారు. అయితే పల్టీ కొట్టిన కారులోంచి బయటపడ్డ వస్తువులు చూసి అక్కడున్నవారు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆకారులో ఏం దొరికిందో తెలుసా.. భారీ మొత్తంలో గంజాయి. కారులో…
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో రాత్రి కారు బీభత్సం సృష్టించింది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వైపు నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 1 వైపు వెళ్తున్న మహేంద్ర థార్ కారు.. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో బ్రిడ్జి దిగి కొంతదూరం వెళ్లగానే రోడ్డు దాటుతున్న యాచకులను ఢీకొట్టింది. దీంతో ఓ మహిళ చేతిలో ఉన్న రెండున్నరేళ్ల బాలుడు కిందపడిపోయింది.. తలకి తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే ఆ బాలుడు కన్నుమూశారు.. ఈ ప్రమాదంలో మహిళ కూడా తీవ్రంగా గాయపడింది..…
రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మేడారం సమక్క-సారక్క జాతర గురించి ప్రత్యేకంగా చెప్పనెక్కర్లేదు. సమ్మక్క-సారక్క అమ్మవార్లను దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. అయితే ఇలా మేడారం జాతరకు బయలుదేరిన ఓ కుటుంబ ప్రయాణం విషాదాంతంగా ముగిసింది. ఎంతో ఆనందంగా అమ్మవార్ల దర్శనం కోసం ఇంటి నుంచి మేడారంకు కారులో ఓ కుటుంబం బయలు దేరింది. అయితే ములుగు జిల్లా గట్టమ్మ ఆలయం వద్దకు రాగానే ఆర్టీసీ బస్సును కారు…
కాలాపతేర్ వద్ద సోమవారం పోలీసు వాహనం డ్రైవర్ మద్యం మత్తులో తన వాహనంతో ముగ్గురు పాదచారులను ఢీకొట్టారు. ఢీకొట్టడంతో ముగ్గురు పాదచారులు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌత్‌జోన్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు అనుబంధంగా పనిచేస్తున్న డ్రైవర్ శ్రీనివాస్ సాయంత్రం వాహనంలో కాలాపతేర్‌కు వెళ్లే సమయంలో మద్యం మత్తులో ఉన్నాడు. అతనితో పాటు అతని స్నేహితుడు కూడా ఉన్నాడు. వాహనం తాడ్‌బన్ క్రాస్‌రోడ్ వద్దకు చేరుకోగానే డ్రైవర్ అదుపు తప్పి ముగ్గురు పాదచారులను ఢీకొట్టినట్లు సమాచారం.…
కరీంనగర్ జిల్లా చింతకుంట గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టాటా ఏసి-కారు ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. దీంతో టాటా ఏస్ లో ఉన్న 18 మందికి ప్రయాణికులుకు కారులో ఉన్న 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అంతేకాకుండా గాయపడిన వారిని వెంటనే కరీంనగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. టాటా ఏస్ లో ఉన్నవారు మహబూబాబాద్ జిల్లాకు చెందిన వారు కాగా కారులో ఉన్నవారు…
అనంతరపురం జాతీయ రహదారి ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. గుంతకల్లు-బళ్లారి రహదారిపై అనంతపురం జిల్లాలోని విడపనకల్లు మండలం డోనేకల్ వద్ద బ్రిడ్జి నిర్మాణంలో ఉంది. అయితే కనీసం ప్రమాద హెచ్చరికలు లేకపోవడంతో నిన్న రాత్రి బ్రిడ్జిపై నుంచి నుంచి కిందకు ఓ కారు పడిపోయింది. వంతెనపై నుంచి సుమారు 30 అడుగుల కిందకు కారు పడిపోయింది. దీంతో వంతెన కింద్రి ఉన్న నీటిలో కారు మునిగిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి జలసమాధి అయ్యాడు.…
కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బిచ్కుంద మండలం జగన్నాథపల్లి వద్ద ఆగివున్న లారీని వెనుకనుంచి కారు ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న 6 గురు మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఇద్దరు చిన్నారులు ఉండగా మరో ఇద్దరు మహిళలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందడంతో హుటాహుటినా పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురికి కూడా తీవ్ర గాయాలు కాగా వారి పరిస్థితి విషమంగా ఉండడంతో…
హైదరాబాద్ లో ఘోర ప్రమాదం తప్పింది. విద్యానగర్ రైల్వే బ్రిడ్జి పై మద్యం మత్తులో దూసుకొచ్చిందో కారు. అదుపుతప్పి డివైడర్ ని ఢీకొనడంతో ప్రమాదం తప్పింది. ఆదివారం ఉదయం పూట ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిపోయిందని స్థానికులు అంటున్నారు. సంఘటన స్థలంలో వాహనదారుడికి బ్రీత్ ఎనాలసిస్ టెస్ట్ చేయగా 90శాతం ఆల్కహాల్ పర్సెంటేజ్ నమోదైంది. దీంతో వాహనదరుడి పై కేసు నమోదు చేసుకుని కారు సీజ్ చేశారు నల్లకుంట ట్రాఫిక్ పోలీసులు. READ ALSO బంజారాహిల్స్‌లో…
హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్‌నెం 2 లో అర్థరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. రోహిత్ అనే వ్యక్తి తాగినమత్తులో అతివేగంగా కారు నడుపుతూ రోడ్డు దాటుతున్న ఇద్దరు యువకులను ఢీ కొట్టడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. కారు దూసుకెళ్లడంతో బీహార్‌కు చెందిన త్రిభువన్‌రాయ్, ఉపేందర్‌కుమార్ దాస్ అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. గమనించిన స్థానికులు వెంటనే రోహిత్‌ను పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రోహిత్‌ను అదుపులోకి…