రాజేంద్రనగర్ లో దారుణం చోటు చేసుకుంది. రోడ్డు పై నడుచుకుంటూ వెళుతున్న ఓ యువతిని కారు తో గుద్ది చంపబోయారు గుర్తు తెలియని వ్యక్తులు. యువతిని ఢీ కొట్టిన వెంటనే కారుతో పారిపోయారు దుండగులు. ఈ వ్యవహారం అంతా సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయింది. రక్తపు మడుగు ల్లో రోడ్డు పడి పోయిన యువతిని స్థానికులు గమనించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే పోలీసులు మాత్రం రోడ్డు ప్రమాదం గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కానీ సీసీ కెమెరాలో మాత్రం స్పష్టంగా రోడ్డు పక్క నుండి నడుచుకుంటూ వెళుతున్న యువతిని కారు తో ఢీ కొట్టి పారిపోయినట్లు తెలుస్తోంది. రోడ్డు పై కారు ముందుకు తీసుకొని వెళ్లి రివర్స్ చేసి మరి ఎదురుగా వస్తున్న యువతిని ఢీ కొట్టారు దుండగులు.
ఈ వ్యవహారంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అది రోడ్డు ప్రమాదమా? లేక హత్య అనే విషయాన్ని పోలీసులు తేల్చాల్సి ఉంది. కుటుంబ సభ్యులు కూడా రోడ్డు ప్రమాదం జరిగినట్లు ఫిర్యాదు చేయడం పలు అనుమానాలకు దారి తీస్తుంది. ఎవరినీ సేవ్ చేయడానికి ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే విషయం అర్దం కాని పరిస్థితి. ఈ ఘటపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.