Home
Car Accident
Car Accident News
-
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. ఆ ఎమ్మెల్యేదేనా..?
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో రాత్రి కారు బీభత్సం సృష్టించింది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వైపు నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 1 వైపు వెళ్తున్న మహేంద్ర థార్ కారు.. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో బ్రిడ్జి దిగి కొంతదూరం వెళ్లగానే రోడ్డు దాటుతున్న యాచకులను ఢీకొట్టింది. దీంతో ఓ మహిళ చేతిలో ఉన్న రెండున్నరేళ్ల బాలుడు కిందపడిపోయింది.. తలకి తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే ఆ బాలుడు కన్నుమూశారు.. ఈ ప్రమాదంలో మహిళ కూడా తీవ్రంగా గాయపడింది..… -
Accident : మేడారంకు బయలుదేరి.. తిరిగిరాని లోకాలకు..
రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మేడారం సమక్క-సారక్క జాతర గురించి ప్రత్యేకంగా చెప్పనెక్కర్లేదు. సమ్మక్క-సారక్క అమ్మవార్లను దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. అయితే ఇలా మేడారం జాతరకు బయలుదేరిన ఓ కుటుంబ ప్రయాణం విషాదాంతంగా ముగిసింది. ఎంతో ఆనందంగా అమ్మవార్ల దర్శనం కోసం ఇంటి నుంచి మేడారంకు కారులో ఓ కుటుంబం బయలు దేరింది. అయితే ములుగు జిల్లా గట్టమ్మ ఆలయం వద్దకు రాగానే ఆర్టీసీ బస్సును కారు… -
మద్యం మత్తులో పాదచారులను ఢీకొట్టిన పోలీస్ డ్రైవర్..
కాలాపతేర్ వద్ద సోమవారం పోలీసు వాహనం డ్రైవర్ మద్యం మత్తులో తన వాహనంతో ముగ్గురు పాదచారులను ఢీకొట్టారు. ఢీకొట్టడంతో ముగ్గురు పాదచారులు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌత్‌జోన్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు అనుబంధంగా పనిచేస్తున్న డ్రైవర్ శ్రీనివాస్ సాయంత్రం వాహనంలో కాలాపతేర్‌కు వెళ్లే సమయంలో మద్యం మత్తులో ఉన్నాడు. అతనితో పాటు అతని స్నేహితుడు కూడా ఉన్నాడు. వాహనం తాడ్బన్ క్రాస్‌రోడ్ వద్దకు చేరుకోగానే డ్రైవర్ అదుపు తప్పి ముగ్గురు పాదచారులను ఢీకొట్టినట్లు సమాచారం.… -
చింతకుంట గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
కరీంనగర్ జిల్లా చింతకుంట గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టాటా ఏసి-కారు ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. దీంతో టాటా ఏస్ లో ఉన్న 18 మందికి ప్రయాణికులుకు కారులో ఉన్న 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అంతేకాకుండా గాయపడిన వారిని వెంటనే కరీంనగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. టాటా ఏస్ లో ఉన్నవారు మహబూబాబాద్ జిల్లాకు చెందిన వారు కాగా కారులో ఉన్నవారు… -
అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ జల సమాధి..
అనంతరపురం జాతీయ రహదారి ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. గుంతకల్లు-బళ్లారి రహదారిపై అనంతపురం జిల్లాలోని విడపనకల్లు మండలం డోనేకల్ వద్ద బ్రిడ్జి నిర్మాణంలో ఉంది. అయితే కనీసం ప్రమాద హెచ్చరికలు లేకపోవడంతో నిన్న రాత్రి బ్రిడ్జిపై నుంచి నుంచి కిందకు ఓ కారు పడిపోయింది. వంతెనపై నుంచి సుమారు 30 అడుగుల కిందకు కారు పడిపోయింది. దీంతో వంతెన కింద్రి ఉన్న నీటిలో కారు మునిగిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి జలసమాధి అయ్యాడు.… -
కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు చిన్నారులు మృతి
కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బిచ్కుంద మండలం జగన్నాథపల్లి వద్ద ఆగివున్న లారీని వెనుకనుంచి కారు ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న 6 గురు మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఇద్దరు చిన్నారులు ఉండగా మరో ఇద్దరు మహిళలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందడంతో హుటాహుటినా పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురికి కూడా తీవ్ర గాయాలు కాగా వారి పరిస్థితి విషమంగా ఉండడంతో… -
దూసుకొచ్చిన కారు.. తృటిలో తప్పిన ప్రాణాపాయం
హైదరాబాద్ లో ఘోర ప్రమాదం తప్పింది. విద్యానగర్ రైల్వే బ్రిడ్జి పై మద్యం మత్తులో దూసుకొచ్చిందో కారు. అదుపుతప్పి డివైడర్ ని ఢీకొనడంతో ప్రమాదం తప్పింది. ఆదివారం ఉదయం పూట ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిపోయిందని స్థానికులు అంటున్నారు. సంఘటన స్థలంలో వాహనదారుడికి బ్రీత్ ఎనాలసిస్ టెస్ట్ చేయగా 90శాతం ఆల్కహాల్ పర్సెంటేజ్ నమోదైంది. దీంతో వాహనదరుడి పై కేసు నమోదు చేసుకుని కారు సీజ్ చేశారు నల్లకుంట ట్రాఫిక్ పోలీసులు. READ ALSO బంజారాహిల్స్‌లో… -
బంజారాహిల్స్‌లో కారు బీభత్సం.. ఇద్దరు మృతి..
హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్‌నెం 2 లో అర్థరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. రోహిత్ అనే వ్యక్తి తాగినమత్తులో అతివేగంగా కారు నడుపుతూ రోడ్డు దాటుతున్న ఇద్దరు యువకులను ఢీ కొట్టడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. కారు దూసుకెళ్లడంతో బీహార్‌కు చెందిన త్రిభువన్‌రాయ్, ఉపేందర్‌కుమార్ దాస్ అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. గమనించిన స్థానికులు వెంటనే రోహిత్‌ను పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రోహిత్‌ను అదుపులోకి… -
హుస్సేన్ సాగర్‌లోకి దూసుకెళ్లిన కారు..
ఎన్టీఆర్ పార్క్ ముందు కారు బీభత్సం సృష్టించింది. ఖైరతాబాద్ కు చెందిన నితిన్, స్పత్రిక్, కార్తీక్ అనే ముగ్గురు యువకులు ఉదయం టిఫిన్ చేసేందుకు ఖైరతాబాద్ నుంచి అఫ్జల్ గంజ్ బయలుదేరారు. అయితే అతివేగంగా కారు నడుపుతుండగా ఎన్టీఆర్ పార్క్ ముందు అదుపుతప్పి ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్‌లోకి దూసుకెళ్లింది. దీంతో కారులో ఉన్న ముగ్గురు యువకులకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే ఈ ఘటనపై సమాచారం అందిన సైఫాబాద్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు… -
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పామర్రు మండలం కాపవరం వద్ద ఓ కారు అదుపుతప్పి డివైడర్ దాటి బైక్ ను ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో కారు దగ్డమైంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు మొవ్వ మండలం కాజా గ్రామానికి చెందిన కామేశ్వర రెడ్డి…
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!