Rishab Pant Injury: టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో డెహ్రాడూన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. హరిద్వార్ జిల్లాలో మంగళూరు, నర్సన్ మధ్య ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్వయంగా కారు డ్రైవ్ చేసిన పంత్.. నిద్రమత్తులో కారు నడపడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో రిషబ్ పంత్ ఒక్కడే కారులో ఉన్నాడని, కారు అద్దాలను పగలగొట్టుకొని బయటకు వచ్చాడని చెప్పారు. ప్రమాదం…
Rishab Pant: టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డుప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం అతడు గాయాలతో డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో రిషబ్ పంత్ ఆరోగ్యంపై వైద్యులు తొలి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆర్థోపెడిక్, ప్లాస్టిక్ సర్జన్ల పర్యవేక్షణలో క్రికెటర్ రిషబ్ పంత్ ఉన్నాడని.. అతడి కండిషన్ నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. పరీక్షలన్నీ ముగిసిన తర్వాత పూర్థిస్థాయి హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని మ్యాక్స్ హాస్పిటల్ డాక్టర్…
హయత్ నగర్ లో శనివారం నిర్ఘాంత పోయే ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు యువతులు రహదారి దాటుతుండగా అతివేగంగా కారు ఢీకొట్టిన ఘటన రాష్ట్ర ప్రజలు ఉలిక్కిపడేలా చేసింది. రోడ్డు ప్రమాదంలో ఆయువతులు ఒక్కసారిగి ఎగిసిపడి పక్కన పడిపోయిన సీసీ కెమెరా దృష్యాలు షాక్ గురియ్యేలా చేశాయి.
సీనియర్ అధికారి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కారు ఆటోను ఢీకొట్టిన ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. పాలకుర్తి మండలం ధర్మారం క్రాస్ రోడ్డు వద్ద ఆటోను ఢీకొట్టింది.
Siddipet Car Accident: సిద్దిపేట జిల్లాలో జరిగిన కారు ప్రమాదం విషాదం మిగిల్చింది. కొండపాక మండలం జప్తి నాచారం శివారులో ఓ కారు అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది. బావిలో పడ్డ కారులో ముగ్గురు వ్యక్తులు ఉండగా.. ఇద్దరు ప్రాణాలతో బయటపడగా మరొకరు కారులోనే ఇరుక్కుపోయి చనిపోయారు. బావిలో పడ్డ కారు, యాదగిరి కోసం ఆరుగంటలపాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. సిద్దిపేట జిల్లా సిరిసినగండ్లకు చెందిన వెంకటస్వామి తన బావలను ఇంటికి తీసుకురావడానికి కారు తీసుకుని కొండపాకకి బయలుదేరాడు.…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మకు పెను ప్రమాదం తప్పింది… అనంతపురంలో జరిగిన ఓ పెళ్లికి హాజరై ఆమె.. ఆ తర్వాత కర్నూలులో వైఎస్సార్ మిత్రుణ్ణి పరామర్శించేందుకు వెళ్లారు.. అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అయిన తర్వాత గుత్తి పెట్రోల్ బంక్ సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు రెండు టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి.. రెండు టైర్లు పేలి.. కారు అదుపుతప్పినా.. డ్రైవర్ చాకచక్యంతో ఈ ప్రమాదం తప్పినట్టుగా తెలుస్తుంది.. ఆ తర్వాత మరో…
నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈఘటనలో ఇద్దరు సజీవ దహనం అయ్యారు. వేల్పూరు క్రాస్ రోడ్డు వద్ద రోడ్డుపై లారీ ఆగివుంది. జగిత్యాల నుంచి ఇద్దరు వ్యక్తులు ఆర్మూర్ వైలుతున్న ఆల్టో కారు ఢీ కొట్టంది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. కారులో వున్న ఇద్దరు ప్రయాణికులు మంటల్లో చిక్కుకున్నవారు కాపాడండి అంటూ కేకలు వేసినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.…