కారు కొన్న తర్వాత, వాహనదారులు తరచుగా వివిధ రకాల యాక్సెసరీలను ఇన్‌స్టాల్ చేసుకుంటారు. అలాంటి ముఖ్యమైన యాక్సెసరీలలో డ్యాష్ క్యామ్ ఒకటి. ప్రయాణ సమయంలో డ్యాష్ కెమెరా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది కారును రోడ్డుపై సురక్షితంగా ఉంచడంలో సహాయపడటమే కాకుండా డ్రైవర్‌కు రక్షణను అందిస్తుంది. ఇది రోడ్డు ప్రమాదాలు, బీమా మోసాలు, లేదా ఇతర సంఘటనలను నిశ్శబ్ద సాక్షిగా రికార్డ్ చేస్తుంది. వాహనం నడుస్తున్నప్పుడు లేదా పార్క్ చేసినప్పుడు కూడా ఇది వీడియోను రికార్డ్ చేస్తుంది.…