అమరావతి రాజధాని ప్రాంత రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రాజధాని రైతులకు పెండింగ్ లో ఉన్న కౌలు నిధులను విడుదల చేసేందుకు సిద్ధం అవుతుంది.. ఈ విషయాన్ని మంత్రి నారాయణ వెల్లడించారు.. పెండింగ్‌లో ఉన్న కౌలు నిధులను త్వరలోనే విడుదల చేస్తాం అని ప్రకటించారు నారాయణ..
ఏపీ హైకోర్టులో రాజధాని రైతులకు ఊరట లభించింది. రైతులకు ఇచ్చిన ప్లాట్లను రద్దు చేస్తూ జారీ చేసిన నోటీసులను హైకోర్టు కొట్టివేసింది. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు గతంలో సీఆర్డీయే ప్లాట్లు ఇచ్చింది. ప్లాట్లను రద్దు చేస్తూ 862 మంది రైతులకు సీఆర్డీఏ, రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. దీంతో రైతులు హైకోర్టును ఆశ్రయించారు.
ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని జగన్ సర్కార్ ప్రకటించడంతో అమరావతి అభివృద్ధికి తమ భూములు ఇచ్చిన రైతులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అంతేకాకుండా సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ రాజధాని రైతులు 45 రోజుల మహా పాదయాత్రను ప్రారంభించారు. నవంబర్ 1న ప్రారంభమైన ఈ పాదయాత్ర నేడు మూడో రోజు కొనసాగుతోంది. ఈ పాదయాత్రలో రాజధాని రైతులతో పాటు మహిళలు పాల్గొన్నారు. అయితే రైతులకు…