ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని జగన్ సర్కార్ ప్రకటించడంతో అమరావతి అభివృద్ధికి తమ భూములు ఇచ్చిన రైతులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అంతేకాకుండా సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ రాజధాని రైతులు 45 రోజుల మహా పాదయాత్రను ప్రారంభించారు.
నవంబర్ 1న ప్రారంభమైన ఈ పాదయాత్ర నేడు మూడో రోజు కొనసాగుతోంది. ఈ పాదయాత్రలో రాజధాని రైతులతో పాటు మహిళలు పాల్గొన్నారు. అయితే రైతులకు టీడీపీ నేత చంద్రబాబుతో పాటు పలువురు నేతల సంఘీభావం తెలిపారు. ఈ రోజు గుంటూరు శివారు అమరావతి రోడ్డు నుంచి ప్రారంభమైన రైతుల పాదయాత్ర సాయంత్రానికి పుల్లడిగుంటకు చేరుకోనుంది.