ఏపీలో గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడ గంజాయి సమాచారం వచ్చిన దాడులు చేస్తూ నిందితులును అదుపులోకి తీసుకుంటున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం యరజర్ల కొండల్లో ఎస్‌ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. కీలక సమాచారంతో ఎస్‌ఈబీ అధికారులు దాడులు నిర్వహించగా 50 లక్షల విలువైన 850 కేజీల గంజాయి అధికారులు పట్టుకున్నారు. గంజాయిని ప్యాకింగ్ చేసి తరలించేందుకు సిద్ధంగా ఉంచిన వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. నగరానికి కూతవేటు దూరంలో భారీగా గంజాయి పట్టుబడడంతో…
కొన్నేళ్లుగా ఏవోబీ బార్డర్‌లో గంజాయి సాగు విస్తృతంగా సాగుతుంది. దీంతో ప్రభుత్వం దీనిపై ఉక్కుపాదం మోపుతుంది. విశాఖ ఏజెన్సీలో గంజాయి పంట సాగు చేస్తున్న గిరిజనులు మీడియాతో మాట్లాడారు. మేం ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం లేదు. గంజాయి మొక్కలు సాగు నేరమే అయినా ఎన్నో కష్టాలతో మేం ముందుకు వచ్చాం. ప్రభుత్వం ముందే చెబితే మేం గంజాయి వేసే వాళ్లం కాదు కదా అంటున్న గిరిజ నులు. మా ఆర్థిక స్థితిగతుల ప్రకారమే మేం గంజాయి వేస్తున్నామని గిరిజనులు…
తెలంగాణలో మాదకద్రవ్యాలపై పోలీసులు ఉక్కుపాద మోపుతున్నారు. అడుగడునా తనిఖీలు, అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలం నజీరాబాద్ తండాలో ఓ రైతు పత్తిపంటలో గంజాయి సాగు చేస్తున్నాడు. దీనిని గుర్తించిన పోలీసులు పత్తిపంటలో గంజాయి సాగు చేస్తున్న రైతును అరెస్టు చేశారు. అంతేకాకుండా సాగు చేస్తున్న గంజాయి పంటను ధ్వంసం చేసి, గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఏపీలో గంజాయి పట్టివేత నిత్యకృత్యంగా మారింది. ప్రతి రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడోచోట భారీగా గంజాయి పట్టుబడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజా మంగళగిరిలో మరోసారి గంజాయి రవాణా తతంగం బయట పడింది. మంగళగిరిలోని కాజా టోల్ ప్లాజా వద్ద వాహనాలు తనఖీ చేస్తుండగా ఓ కారులో 50 కిలోల గంజాయిని పోలీసులు గుర్తించారు. దీంతో డ్రైవర్ కారును వదిలి పరారయ్యాడు. విశాఖ నుంచి చెన్నైకి గంజాయి తరలిస్తున్నారనే అనుమానం పోలీసులు వ్యక్తం చేశారు. అయితే ఈ…
ఏపీలో ఎక్కడ వాహనాలు తనిఖీలు చేపట్టినా భారీగా గంజాయి దొరుకుతోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తమైన పోలీసులు అడుగడుగునా తనిఖీలు చేపట్టారు. అనుమాన వచ్చిన వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇప్పటికే విజయవాడ కేంద్రంగా సుమారు 6 కోట్లు విలువ చేసే నిషేదిత గంజాయిని పట్టుకున్నట్లు సీపీ బత్తిన శ్రీనివాసులు ఓ ప్రకటనలో వెల్లడించారు. Read Also : వీడియో : స్కూటీపై టపాసులు తీసుకెళ్లుండగా పేలుడు.. తండ్రికొడుకులు దుర్మరణం.. ఈ నేపథ్యంలో గంజాయి రవాణాను అరికట్టేందుకు…
ఏపీలో గంజాయి పండుగ నడుస్తోంది. అదేంటి అనుకుంటున్నారా.. అవునండీ.. ఏపీలో రోజూ ఎక్కడోచోట గంజాయి దొరకడమే దీనికి నిదర్శనం. మత్తు పదార్థాలైన గంజాయి, డ్రగ్స్‌పై రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అడుగడుగా చెక్ పోస్టులు పెట్టి తనిఖీలు నిర్వహించడంతో భారీ గంజాయి వెలుగులోకి వస్తోంది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో గంజాయిని పూర్తిస్థాయిలో ఆరికట్టేందుకేందు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామని పోలీసులు చెబుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో గంజాయి సాగు తక్కువగా ఉన్నప్పటికీ, ఇక్కడ నుంచే గంజాయి రవాణా…
ఓ హార్స్ రైడింగ్ క్లబ్ లో అనుమతి లేకుండా పుట్టిన రోజు వేడుకలు జరుగుతుండడంతో ఎస్‌వోటీ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో మద్యం, గంజాయి మత్తులో యువతీ యువకులు పట్టుబడ్డ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఎస్‌వోటీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ గ్రామ సమీపంలోని ఓ హర్స్ రైడింగ్ క్లబ్‌లో ఎలాంటి అనుమతులు లేకుండా బుధవారం అర్థరాత్రి పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. ఈ విషయంపై సమాచారం అందడంతో…
హైదరాబాద్‌లోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.. టాంజానియా దేశస్తుడి దగ్గర రూ.20 కోట్ల విలువచేసే హెరాయిన్ గుర్తించారు.. హెరాయిన్‌ను ట్రాలీ బ్యాగ్ కింద భాగంలో దాచి తరలిస్తున్న జాన్ వియమ్స్ అనే వ్యక్తి నుంచి 3 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు డీఆర్‌ఐ అధికారులు… కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.. దోహా నుంచి హైదరాబాద్‌కు హెరాయిన్ తీసుకొచ్చిన జాన్… ఆస్ట్రేలియాకు సరఫరా చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. వారం రోజుల క్రితం…