మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో సోనియాగాంధీ నగర్ కాలనిలో గంజాయి మత్తులో ముగ్గురు యువకులు వీరంగం సృష్టించారు. ఈ ముగ్గురు యువకులు గంజాయికి బానిసై సోనియాగాంధీ నగర్ కాలనిలో ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటూ అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడ్డారు.
భారత్‌లో గంజాయి సాగు చేయడం నిషేధం. భారత్‌లోనే కాదు… ఆసియా దేశాల్లో గంజాయి సాగు చేసినా, తరలించినా, విక్రయించినా, వినియోగించినా నేరమే. కానీ.. థాయ్‌లాండ్ ప్రభుత్వం గంజాయి సాగుతోపాటు, దాని వినియోగాన్ని కూడా చట్టబద్ధం చేస్తూ గురువారం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో గంజాయి వాడకాన్ని ప్రోత్సహించిన తొలి ఆసియా దేశంగా నిలిచింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో నిన్నటి నుంచే అక్కడి దుకాణాలు, కేఫ్‌లలో గంజాయి విక్రయాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. గంజాయిని చట్టబద్ధం చేసిన ప్రభుత్వం..…
తెలంగాణలో గుంట భూమి ఉన్నా.. రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలను వర్తింపజేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.. అయితే, రాష్ట్రంలోని 148 మంది రైతులకు రైతు బంధు ఆపాలని తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది ఎక్సైజ్‌శాఖ.. గంజాయి పండిస్తున్న రైతులకు రైతు బంధు కట్ చేయాలని కోరింది.. గంజాయి పండిస్తున్న 148 మంది రైతులపై 121 కేసులు నమోదు అయినట్టు సీఎం దృష్టికి తీసుకెళ్లింది ఎక్సైజ్ శాఖ.. గంజాయి సాగు చేస్తున్న వీరికి రైతు బంధు నిలిపివేయాలని…
అసాంఘీక కార్యక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా డార్క్ వెబ్ నెలవైంది. ఈ వెబ్సైట్లో దొరకనిది అనేది ఉండదు. మనిషిని చంపాలన్న మనిషిని వెంటాడి కిడ్నాప్ చేయాలని, డ్రగ్స్ కావాలన్నా, ఆయుధాలు కావాలని డార్క్ వెబ్‌లో విచ్చలవిడిగా దొరుకుతాయి. డార్క్ వెబ్ పైన ఎవరు నిఘా పెట్టలేదు. అయితే హైదరాబాద్ పోలీసులు ఇప్పుడు అసాంఘీక కార్యక్రమాలకు అడ్డాగా మారిన డార్క్ వెబ్ పైన నిఘా పెట్టారు. సిటీ పోలీస్ నుంచి ఎప్పటికప్పుడు డార్క్ వెబ్ పై అనాలసిస్ చేస్తున్నారు. అంతేకాదు…
హైదరాబాద్ లో డ్రగ్స్ వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. అయిన ప్రతి నిత్యం ఎక్కడో ఓ చోట డ్రగ్స్ సరఫరాదారులు, వినియోగదారులు పట్టుబడుతూనే ఉన్నారు. ఇటీవలే బిజినెస్ మన్ లు వైద్యులు, ఇప్పుడు తాజాగా ఐ టి ఎంప్లాయిస్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు మాదకద్రవ్యాలు వినియోగిస్తున్న సిటీ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పోలీసులకు పట్టుబడ్డారు. డ్రగ్స్ కేసులో ఎవరి ప్రమేయం ఉన ఎంతటి వారినైనా వదిలేది లేదని నగర పోలీస్ బాస్ హెచ్చరించారు నార్కోటిక్స్…
కోవిడ్ టైంలో కొంత మంది విద్యార్థులు గంజాయికి అలవాటు పడ్డారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొంతమంది అమ్మాయిలు కూడా గంజాయికి అలవాటు పడుతున్నారని ఆయన వెల్లడించారు. ఇంటర్ నేషనల్ స్కూల్ వద్ద బయట కొంత మంది డ్రగ్స్ విక్రయిస్తున్నారని, డ్రగ్స్ చాపకింద నీరులా విస్తరిస్తోందని ఆయన తెలిపారు. ఓచ్చే 10 సంవత్సరాల్లో ప్రధానంగా రెండు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఒకటి ఎంప్లాయ్ మెంట్ రెండు మాదక…
రోజురోజుకు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. స్మగ్లింగ్ చేయడంలో కొత్తకొత్త పంథాలను తొక్కుతూ పోలీసులకు చిక్కి జైలు ఊసలు లెక్కెడుతున్నారు. అయితే ఈ రోజు ఢిల్లీ ఎయిర్‌పోర్డ్‌లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఎయిర్ పోర్ట్ లోని గేట్ నెంబర్ 11 వద్ద అనుమానాస్పద కవర్ ను కస్టమ్స్ అధికారులు గుర్తించారు. అప్రమత్తమైన అధికారులు ఆ కవర్‌ను జాగ్రత్తగా తెరిచిచూడడంతో అందులో 51 క్యాపసల్స్ లో నింపిన కొకైన్‌ను గుర్తించారు. దీంతో మరోసారి ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో డ్రగ్స్ కలకలం…
మాదకద్రవ్యాలకు యువతే కాకుండా ఎంతో చదువుకున్న వైద్యులు కూడా బానిసలవుతున్నారు. ఢిల్లీ డ్రగ్స్ కేసులో హైదరాబాద్‌రె చెందిన డాక్టర్ కు ప్రమేయం ఉందని పోలీసుల విచారణలో తేలింది. ఢిల్లీలో డ్రగ్స్ ను సరఫరా చేస్తున్న కేసులో ఇప్పటికే నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు 22 మంది అరెస్ట్ చేశారు. అయితే ఇందులో హైదరాబాద్ కు చెందిన వైద్యుడు ఆదిత్య రెడ్డి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆదిగ్య రెడ్డి సైకియాట్రిస్ట్ గా పనిచేస్తున్నారు. మానసిక రోగులపై ఈ డ్రగ్స్…
ప్రేమ గుడ్డిదని పలువురు అంటుంటే విని ఉంటాం.. ప్రేమ మైకంలో తప్పని తెలిసినా కొందరు చెడు దారులు తొక్కుతూ.. వారి అందమైన జీవితాన్ని అంధకారంలోకి నెట్టుకుంటున్నారు. అంతేకాకుండా వారిపైన ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు తీరాన శోకాన్ని మిగుల్చుతున్నారు. ఇలాంటి ఘటనే విశాఖపట్నంలో చోటును చేసుకుంది. మర్రిపాలెం గ్రీన్ గార్డెన్స్ ఏరియాకు చెందిన యువకుడు, హైదరాబాద్ కు చెందిన ఓ యువతి ప్రేమించుకుంటున్నారు. అయితే డ్రగ్స్ కు ప్రియుడు అలవాటుపడ్డంతో ప్రియుడి కోసం హైదరాబాద్ నుంచి డ్రగ్స్…
గంజాయి, మత్తు పదార్థాలు సాగుచేస్తున్న, రవాణా వారిపై ఉక్కుపాదం మోపాలని అధికారులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. గంజాయి సాగు చేస్తున్న రైతుల, పండిస్తున్న భూముల వివరాలను సేకరించి రైతుబంధు డబ్బులు రాకుండా వ్యవసాయ శాఖ అధికారులచే ఎక్సైజ్, పోలీస్ శాఖల అధికారులు కృషి చేయాలని మంత్రి సూచించారు. ఎక్సైజ్, పోలీస్ శాఖల అధికారులు సమన్వయంతో గంజాయి రవాణా చేస్తున్న వారిపై, అనుమానితులపై నిఘా ఉంచాలని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. గంజాయి రవాణా చేస్తున్న సాగుచేస్తున్న…