MCED Blood Test Detects Cancer Early: ప్రజలను రోజురోజుకు క్యాన్సర్ విస్పోటనం కలవరపెడుతోంది. ఈ మహమ్మారి ప్రజారోగ్యానికే గండంగా మారుతోంది. గడిచిన అయిదేళ్లలో తెలుగు రాష్ట్రాల్లోనూ చాప కింద నీరులా విస్తరిస్తూ ప్రాణాలు తీసేస్తున్నాయి రకరకాల క్యాన్సర్లు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పార్లమెంట్‌కు తెలిపిన గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా గడిచిన 5 ఏళ్లలో క్యాన్సర్ల కేసుల సగటు పెరుగుదల 11.55 శాతంగా ఉంది. ఏపీలో 9%, తెలంగాణలో 10 శాతం చొప్పున కేసులు పెరుగుతున్నాయి.…
క్యాన్సర్ అంటే ఏమిటి? సాధారణంగా మన శరీరంలో కణ విభజనలు ఒక క్రమ పద్ధతిలో జరుగుతాయి. అయితే, కొన్ని కారణాల వల్ల, ఆ కణాలు నియంత్రణ కోల్పోయి, చాలా వేగంగా, అస్తవ్యస్తంగా విభజన చెంది కణ సమూహాలను ఏర్పరుస్తాయి. ఆ స్థితిని క్యాన్సర్ అంటారు. ఈ కణ సమూహాలను 'కణితి'( ట్యూమర్) అని పిలుస్తారు. దేశంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధుల్లో మొదటి స్థానం గుండె జబ్బులది కాగా, ఆ తరవాత స్థానం క్యాన్సర్‌దే. ప్రపంచ వ్యాప్తంగా,…