MCED Blood Test Detects Cancer Early: ప్రజలను రోజురోజుకు క్యాన్సర్ విస్పోటనం కలవరపెడుతోంది. ఈ మహమ్మారి ప్రజారోగ్యానికే గండంగా మారుతోంది. గడిచిన అయిదేళ్లలో తెలుగు రాష్ట్రాల్లోనూ చాప కింద నీరులా విస్తరిస్తూ ప్రాణాలు తీసేస్తున్నాయి రకరకాల క్యాన్సర్లు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పార్లమెంట్‌కు తెలిపిన గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా గడిచిన 5 ఏళ్లలో క్యాన్సర్ల కేసుల సగటు పెరుగుదల 11.55 శాతంగా ఉంది. ఏపీలో 9%, తెలంగాణలో 10 శాతం చొప్పున కేసులు పెరుగుతున్నాయి.…
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయ్యింది. బైడెన్‌కు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉందని, ఆ క్యాన్సర్ కణాలు ఇప్పుడు అతని ఎముకలకు వ్యాపించాయని వైద్యులు నిర్ధారించారు. దీనికి సంబంధించి ఆయన కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. 82 ఏళ్ల బైడెన్ మూత్ర విసర్జన లక్షణాల గురించి పరీక్షలు చేయించుకున్నప్పుడు ఈ విషయం బయటపడింది. వైద్యులు బైడెన్ కు ఏయే చికిత్సలు అందించాలో పరిశీలిస్తున్నారు. ప్రోస్టేట్ క్యాన్సర్ హార్మోన్-సెన్సిటివ్‌గా కనిపిస్తుంది.…
Ants Can Detect Scent Of Cancer In Urine: చీమలకు క్యాన్సర్ ను గుర్తించగలవని కొత్త అధ్యయనంలో తేలింది. చీమలు మూత్రం వాసన చూడటం ద్వారా క్యాన్సర్ ని గుర్తించగలవని శాస్త్రవేత్తలు కనుగొన్నారని వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. చీమలకు ముక్కులు లేకపోయిన వాటి ముందు భాగంలో ఉంటే యాంటేన్నా వంటి నిర్మాణాలపై గ్రాహాకాలు ఉంటాయి. ఇవి వాసనను గుర్తించగలవు. ముఖ్యంగా క్యాన్సర్ ఉన్న కణితులు అస్థిరమైన కర్బన సమ్మేళనాలని పిలువబడే రసాయనాలను విడుదల చేస్తాయి. ఇమ…
ప్రాణాంతక మహమ్మారి క్యాన్సర్ కారక జన్యువులను గుర్తించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) టూల్ అందుబాటులోకి రానుంది. మద్రాస్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) రూపొందించిన ఈ పరికరాన్ని పివోట్ (PIVOT) అని పేర్కొంటారు. దీని సాయంతో ఏ పేషెంట్‌లో ఏ జన్యువు కారణంగా క్యాన్సర్ వచ్చిందో తెలుసుకోవచ్చు. ఫలితంగా వ్యక్తి స్థాయి చికిత్స విధానాన్ని డెవలప్ చేయొచ్చు. ఇప్పటివరకు ఒకే రకమైన క్యాన్సర్ రోగులకు ఒకే విధమైన ట్రీట్మెంట్ చేసేవారు. పివోట్‌తో ఈ పద్ధతిలో మార్పు రానుంది.…