కెనడా తదుపరి ప్రధానిగా మార్క్ కార్నీ ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన సమావేశంలో మార్క్ కార్నీని అధికార లిబరల్ పార్టీ ఎన్నుకుంది. మార్క్ కార్నీ ఎప్పుడూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. అంతేకాకుండా మంత్రివర్గంలో పనిచేసిన అనుభవం కూడా లేదు. అనూహ్యంగా కెనడా 24వ ప్రధానిగా మార్క్ కార్నీ ఎన్నిక కావడం విశేషం. ప్రధాని పదవి నుంచి వైదొలుగుతున్నట్లు జస్టిన్ ట్రూడో జనవరిలో ప్రకటించారు. దీంతో లిబరల్ పార్టీలో కొత్త ప్రధాని ఎన్నిక అనివార్యమైంది. ఇది కూడా చదవండి:…
Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా సుంకాల విధింపుతో కెనడా, మెక్సికో, చైనాలను దెబ్బకొట్టాడు.
Delta Plane Crash: కెనడాలో మరో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం నాడు టొరంటోలోని పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం.. ల్యాండ్ అయిన తర్వాత అదుపు తప్పి బోల్తా పడింది.
Canada : 2023 సంవత్సరంలో కెనడాలో జరిగిన పెద్ద బంగారు దొంగతనంలో కొత్త కోణం బయటపడింది. ఈ దొంగతనంలో కెనడియన్ పోలీసులు కూడా ఒక భారతీయుడిపై అనుమానాలు వ్యక్త పరిచారు.
Donlad Trump: డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనిచేశాడు. కెనడా, మెక్సికోలపై సుంకాలు విధిస్తానని ఎన్నికల ప్రచారంలో చేసిన వాగ్దానాన్ని అమలు చేశాడు. మంగళవారం నుంచి పొరుగు దేశాలైన కెనడా, మెక్సికోల దిగుమతులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. శనివారం, ట్రంప్ చైనా నుండి వచ్చే అన్ని దిగుమతులపై 10 శాతం, మెక్సికో, కెనడా నుండి వచ్చే దిగుమతులపై 25 శాతం సుంకాలు విధించే కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు
Canada: డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత నుంచి అక్రమ వలసదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. అమెరికాలో అక్రమంగా డాక్యుమెంట్లు లేకుండా నివసిస్తున్న వారిని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ బహిష్కరిస్తోంది. ఇప్పుడు కెనడా కూడా అదే దారిలో వెళ్లేందుకు సిద్ధమవుతోంది.
Tahawwur Rana: అమెరికా సుప్రీం కోర్టు శనివారం 2008లో జరిగిన ముంబై ఉగ్రవాద దాడుల నిందితుడు తహవ్వూర్ రాణాను భారత్కు పంపించేందుకు ఆమోదం తెలిపింది. 2008 ముంబై ఉగ్రదాడిలో నిందితుడైన తహవ్వూర్ రానా, పాకిస్తాన్ మూలానికి చెందిన కెనడియన్ పౌరుడిగా గుర్తించబడ్డాడు. రానా అప్పగింతను అమెరికా సుప్రీంకోర్టు ఆమోదించింది. జనవరి 21న, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేసిన ఒక రోజు తర్వాత, అమెరికా సుప్రీంకోర్టు అతని అప్పీల్ను తిరస్కరించింది. ‘పిటీషన్ను కొట్టివేస్తున్నాం’ అని కోర్టు…
ట్రంప్ తన నిర్ణయంపై ఎప్పుడు ముందుకెళ్లినా దానికి తగినట్లు స్పందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పేర్కొన్నారు. ఆయన నిర్ణయం అమలు చేస్తే యూఎస్ వినియోగదారులే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది అన్నారు.
Canada : 2025 నుంచి కెనడా విద్యార్థుల స్టడీ పర్మిట్ అప్లికేషన్లకు గరిష్ట పరిమితిని నిర్దేశించింది. ప్రపంచ వ్యాప్తంగా కెనడాలో చదువుకోవాలని భావిస్తున్న విద్యార్థుల కోసం 5,05,162 అప్లికేషన్ల వరకు మాత్రమే అనుమతించబడతాయి.