King Charles III: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాను USAలో 51వ రాష్ట్రంగా కలిపేసేందుకు చేస్తున్న బెదిరింపుల నడుమ, బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III ఓటావాలో పార్లమెంటు ప్రారంభ సభలో తన కీలక ప్రసంగంలో కెనడాను శక్తివంతమైన, స్వతంత్ర దేశంగా ప్రశంసించారు. కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ ఆహ్వానంతో దేశాధిపతిగా హాజరైన చార్లెస్, మారుతున్న అంతర్జాతీయ సంబంధాలు.. అలాగే ముఖ్యంగా అమెరికాతో ఉన్న సంబంధాలపై కామెంట్లు చేసారు. Read Also: Chandigarh:…
Indo-Pak tensions: పహల్గామ్ ఉగ్రవాద దాడికి భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో ప్రతీకారం తీర్చుకుంది. బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్, పీఓకే లోని ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేస్తూ మిస్సైల్ అటాక్ నిర్వహించింది. ఈ దాడిలో 100 మందికి పైగా లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాడులు మరణించారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి.
Khalistan Terrorist: కెనడా దేశంలో ఖలిస్థానీలు రెచ్చిపోతున్నారు. తాజాగా ఆ దేశం నుంచి 8 లక్షల మంది హిందువులను వెనక్కి పంపించాలంటూ వేర్పాటు వాదులు టొరొంటోలోని మాల్టన్ గురుద్వారాలో ఓ ప్రదర్శన ఏర్పాటు చేశారు.
కెనడాలో భారతీయ విద్యార్థిని వంశిక అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆమె మరణవార్తను భారత హైకమిషన్ ధృవీకరించింది. కేసు దర్యాప్తులో ఉందని తెలిపింది.
Terror attack: శనివారం రాత్రి కెనడాలో ఘోర సంఘటన జరిగింది. వాంకోవర్‌లో జరిగి ఓ ఫెస్ట్‌లో దుండగుడు జనాలపైకి కారును వేగంగా నడిపి, దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. చాలా మంది గాయపడ్డారని స్థానిక పోలీసులు తెలిపారు. దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని 30 ఏళ్ల వాంకోవర్ వాసిగా గుర్తించారు. కారు డ్రైవర్ ఒక ఆసియా యువకుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరణించిన వారి సంఖ్యను…
Canada: ఖలిస్తానీలకు అడ్డాగా ఉన్న కెనడాలో అరాచకం సృష్టిస్తున్నారు. వాంకోవర్‌లో ఒక గురుద్వారాపై దాడికి పాల్పడి ధ్వంసం చేశారు. గురుద్వారాపై ఖలిస్తానీ అనుకూల గ్రాఫిటీతో రాతలు రాశారు. ఈ సంఘటన వాంకోవర్‌లోని ఖల్సా దివాన్ సొసైటీ లేదా KDS గురుద్వారాలో జరిగింది, దీనిని రాస్ స్ట్రీట్ గురుద్వారాగా పిలుస్తారు. సిక్కు దేవాలయం పార్కింగ్ స్థలం చుట్టూ ఉన్న గోడపై అనేక చోట్ల ‘‘ఖలిస్తాన్’’ అనే పదాన్ని స్ప్రే పెయింట్ చేసినట్లు గురుద్వారా పరిపాలన అధికారులు చెప్పారు. Read…
కెనడాలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ కాల్పుల్లో భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. బస్టాప్ లో బస్సుకోసం ఎదురుచూస్తుండగా.. ఇద్దరు కారు డ్రైవర్లు ఒకరిపై ఒకరు కాల్పులు జరిపిన సమయంలో ఆ విద్యార్థినికి తూటా తగలడంతో మృతిచెందిందని పోలీసులు తెలిపారు. మరణించిన విద్యార్థిని హర్‌సిమ్రత్ రంధావా గుర్తించారు. ఆమె కెనడాలోని ఒంటారియోలోని మేహాక్ కళాశాలలో చదువుతోంది. హామిల్టన్ పోలీసులు ఈ హత్యపై దర్యాప్తు చేస్తున్నారు. Also Read:AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో సిట్ దూకుడు..…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2 నుంచి పరస్పర సుంకాలను ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో తాజాగా యూఎస్ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. చైనా, కెనడా, మెక్సికోలతో భారత్ ను పోల్చమని యూఎస్ తెలిపింది. భారత్- అమెరికాల మధ్య వాణిజ్యపరమైన ఒప్పందానికి సంబంధించిన చర్చలు బుధవారం ప్రారంభమయ్యాయి. యూఎస్‌కు చెందిన వాణిజ్య శాఖ అధికారులు, ఢిల్లీలోని అధికారులతో చర్చల సమయంలో ఈ విషయంపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది.
Viral Video: కెనడాలో రోజురోజుకు భారత వ్యతిరేకత పెరుగుతోంది. ముఖ్యంగా, ఖలిస్తానీ వేర్పాటువాదులు గతంలో భారతీయులను టార్గెట్‌గా చేస్తూ దాడులు చేసిన సంఘటనలు ఉన్నాయి. హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే, తాజాగా కెనడాలోని కాల్గరీలో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది.
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలతో ప్రపంచదేశాలను హడలెత్తిస్తున్నారు. ఇప్పటికే కెనడా, మెక్సికో, చైనా ఉత్పత్తులపై సుంకాలు విధించారు. మరోవైపు అమెరికన్ ఉత్పత్తులపై సుంకాలు విధించే, దేశాలపై పరస్పర సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉంటే, తాజాగా అమెరికా కెనడాపై మరోసారి టారిఫ్స్‌తో విరుచుకుపడింది.