మలయాళ కుట్టీ అనుపమా పరమేశ్వరన్ నటించిన '18 పేజీస్' మూవీ ఈ నెల 23న జనం ముందుకు రాబోతోంది. ఆ తర్వాత వారమే అంటే 29వ తేదీ అనుపమా నటించిన లేడీ ఓరియంటెడ్ థ్రిల్లర్ మూవీ 'బట్టర్ ఫ్లై' తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
నటి అనుపమ పరమేశ్వరన్ అభిమానుల గుండెల్లో తూట్లు పొడిచేసింది. తాను ప్రేమలో ఉన్నానంటూ కుండబద్దలు కొట్టింది. అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ సంచలన విషయాన్ని బయటపెట్టింది. మొదట పెళ్ళి గురించి అడగ్గా.. తాను ప్రేమ వివాహమే చేసుకుంటానని తెలిపింది. ప్రేమ వివాహంపై తనకు సదాభిప్రాయం ఉందని, ప్రేమించి పెళ్ళి చేసుకున్న జంటల్ని చూస్తే ముచ్చటగా అనిపిస్తుందని పేర్కొంది. తనక్కూడా ప్రేమ పెళ్ళే చేసుకోవాలనుందని, తన…