Anupama Parameswaran: మలయాళీ ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వరన్ కు ఈ యేడాది ‘కార్తికేయ -2′ రూపంలో బిగ్ హిట్ దక్కింది. చిత్రం ఏమంటే… ఆ చిత్ర కథానాయకుడు నిఖిల్ తోనే అనుపమా పరమేశ్వరన్ నటించిన మరో సినిమా ’18 పేజీస్’ కూడా ఈ నెల 23న విడుదల కాబోతోంది. ఈ సినిమా మీద కూడా అనుపమా భారీ ఆశలే పెట్టుకుంది. ఈ యేడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ‘రౌడీ బాయ్స్’ మూవీలో నటించిన అనుపమా ఆ తర్వాత నాని మూవీ ‘అంటే సుందరానికి’లోనూ ఓ ప్రధాన పాత్రను పోషించింది.
విశేషం ఏమంటే… ఈ యేడాది ప్రారంభమే కాదు… ముగింపు కూడా అనుపమా పరమేశ్వరన్ కు మంచిగా గుర్తుండిపోనుంది. డిసెంబర్ చివరి రెండు వారాలలో ఆమె నటించిన రెండు సినిమాలు బ్యాక్ టూ బ్యాక్ రాబోతున్నాయి. నిఖిల్ సరసన నటించిన ’18 పేజీస్’ 23న వస్తుంటే… ఆమె ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన ‘బట్టర్ ఫ్లై’ మూవీ 29న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో టెలీకాస్ట్ కానుంది. అంతేకాదు… తెలుగుతో పాటు కన్నడ, తమిళ, మలయాళ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. భూమిక చావ్లా కీలక పాత్ర పోషించిన ఈ మూవీని ఘంటా సతీశ్ బాబు దర్శకత్వంలో జెన్ నెక్ట్స్ మూవీస్ సంస్థ నిర్మించింది.