TCS: భారతీయ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీస్(టీసీఎస్) ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పబోతోంది. త్వరలో ఉద్యోగులకు జీతాల పెంపు ఉన్నట్లు తెలుస్తోంది. ఆఫ్‌సైట్ ఉద్యోగులు 7-8 శాతం వరకు జీతాల పెంపును పొందవచ్చు, అయితే ఆన్‌సైట్ సిబ్బందికి మాత్రం 2-4 శాతం పెంపు ఉండే అవకాశం ఉంది. ఈ ఇంక్రిమెంట్లు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం జీతాల పెంపు ప్రక్రియ పూర్తయ్యే దశలో ఉందని సంస్థ చెబుతోంది. ఇదిలా ఉంటే మెరుగైన…
Zomato: ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ ‘జొమాటో’(Zomato) శాఖాహారుల కోసం సరికొత్తగా రాబోతోంది. శాఖాహార వినియోగదారుల్ని దృష్టిలో పెట్టుకుని పూర్తిగా ‘ప్యూర్ వెజ్ మోడ్’ని ప్రారంభించింది. వెజిటేరియన్ల కోసం ‘‘ప్యూర్ వెజ్ ప్లీట్’’ ద్వారా డెలివరీలు అందించబడుతాయి. జొమాటో సాంప్రదాయ డ్రెస్ కోడ్‌కి బదులుగా గ్రీన్ యూనిఫాం, గ్రీన్ డెలివరీ బ్యాగ్స్‌ని కలిగి ఉంటుంది. గతంలో వీరికి రెడ్ యూనిఫాం, రెడ్ డెలివరీ బాక్సులు ఉండేవి. ఇప్పుడు ఈ రెడ్ డ్రెస్ కోడ్ నాన్-వెజ్‌కి పరిమితం కానుంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ (మంగళవారం) నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. ప్రపంచ మార్కెట్లో ప్రతికూల పవనాలు దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఈ వారంలో అమెరికా ఫెడల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు తీసుకున్న నిర్ణయంతో మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
Paytm Crisis: డిజిటల్ చెల్లింపుల విభాగంలో ఓ వెలుగు వెలిగిన పేటీఎం పరిస్థితి తారుమారైంది. ఫారన్ లావాదేవీల ఆరోపణల నేపథ్యంలో సెంట్రల్ ఏజెన్సీలు దర్యాప్తు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 29 నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఎలాంటి డిపాజిట్లు తీసుకోవద్దని ఆర్బీఐ గత నెలలో ఆదేశాలు జారీ చేసింది. అయితే తాజాగా ఆర్బీఐ పేటీఎంకు ఊరట కలిగించే విషయాన్ని వెల్లడించింది. మార్చి 15 వరకు గడువు పొడగిస్తున్నట్లు తెలిపింది.
Tower Semiconductor: భారతదేశం సెమీకండక్టర్ తయారీ పరిశ్రమల్లో పురోగమించాలనే ప్రధాని నరేంద్రమోడీ లక్ష్యానికి అనుగుణంగా పలు దిగ్గజ సెమీకండక్టర్ కంపెనీలు ఇండియాలో తన ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి. ఇప్పటికే యూఎస్ చిప్ మేకర్ మైక్రాన్ టెక్నాలజీ గుజరాత్‌లో అసెంబ్లీ, టెస్ట్ ఫెసిలిటీని స్థాపించడానికి 825 మిలియన్ల పెట్టుబడిని ప్రకటించింది. ఫేజ్-1, ఫేజ్-2లుగా ఈ సంస్థ ప్లాంట్ సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి మైక్రాన్ తన తొలి చిప్ విడుదల చేస్తుందని…
Recession In Tech: ఏడాది కాలంగా టెక్ రంగం అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. ప్రపంచ ప్రఖ్యాత టెక్ కంపెనీలైన గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటివి వేల సంఖ్యలో తమ ఉద్యోగులను తొలగించాయి. ఆర్థిక మాంద్యం భయాలు, ఆర్థిక మందగమనం భయంలో ఖర్చులను తగ్గించుకునేందుకు టెక్ కంపెనీలు లేఆఫ్స్ ప్రకటించాయి. ప్రపంచవ్యాప్తంగా టెక్ ఉద్యోగులు దీనికి ప్రభావితమయ్యారు. ద్యోగాల కోతలను ట్రాక్ చేస్తున్న స్టార్ట్-అప్ Layoffs.fyi ప్రకారం ఇప్పటివరకు, 2024లో దాదాపు 32,000 మంది టెక్ కార్మికులు తమ…
TCS: కోవిడ్ మహమ్మారి సమయంలో అన్ని టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్(WFH) అవకాశం ఇచ్చాయి. ప్రస్తుతం కోవిడ్ సమస్య సమిసిపోయి సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం అన్ని టెక్ కంపెనీలు కూడా తమ ఉద్యోగులను ఆఫీసులకు రావాలని, రాకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నాయి. వర్క్ కల్చర్ మెరుగుపరిచేందుకు, భద్రత దృష్ట్యా ఉద్యోగులను ఆఫీసులకు రావాలని, లేకపోతే కెరీర్ పరిమితులను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నాయి.
Paytm: ఇండియాలో డిజిటల్ చెల్లింపుల్లో ఒక సందర్భంలో వెలుగు వెలిగిన పేటీఎం ఇప్పుడు చీకట్లను ఎదుర్కొంటోంది. ఈ సంస్థ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఫెమా, ఫారెక్స్ ఉల్లంఘటన నేపథ్యంలో ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) పేటీఎం కార్యకలాపాలను నిలిపేయాలని జనవరి 31న ఆదేశించింది.
Most Valuable Company: ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా మైక్రోసాఫ్ట్ నిలిచింది. యాపిన్ని అధిగమించి ఈ స్థానానికి చేరుకుంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి యాపిల్ డిమాండ్ ఆందోళనల్ని ఎదుర్కొంటోంది. గురువారం యాపిల్ని అధిగమించి అంత్యంత విలువైన కంపెనీగా మైక్రోసాఫ్ట్ నిలిచింది. మైక్రోసాఫ్ట్ షేర్లు 1.5 శాతం పెరిగాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేసులో మైక్రోసాఫ్ట్ ఆధిక్యత 2.888 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను సహాయపడింది.
Gurugram: ఇండియాలోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ డెవలపర్ డీఎల్ఎఫ్ లిమిటెడ్ ఢిల్లీ సమీపంలో 865 మిలియన్ డాలర్లతో చేపడుతున్న లగ్జరీ హోమ్స్ నిర్మాణం ప్రారంభం కాకముందే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. కేవలం మూడు రోజుల్లోనే ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్ ప్రాంతంలో 1,113 విలాసవంతమైన నివాసాలను విక్రయించింది. డీఎల్ఎఫ్ ప్రివానా సౌత్ ప్రాజెక్టులోని ఏడు టవర్లను నిర్మిస్తోంది. ఇందులో ఫోర్-బెడ్రూనం నివాసాలు, పెంట్ హౌజ్ యూనిట్లు అమ్ముడైనట్లు డెవలపర్ ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో తెలిపారు.