దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ (మంగళవారం) నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. ప్రపంచ మార్కెట్లో ప్రతికూల పవనాలు దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఈ వారంలో అమెరికా ఫెడల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు తీసుకున్న నిర్ణయంతో మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మరో వైపు క్రూడాయిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో ఇన్వేస్టర్ల సెంటిమెంట్‌ను బాగా దెబ్బ తీసింది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 86 డాలర్లకు పైగానే ట్రేడ్ అవుతుంది.
Read Also: Gaza War: అల్-షిపా ఆస్పత్రిపై ఇజ్రాయిల్ దాడి.. 20 మంది హమాస్ ఉగ్రవాదులు హతం..
ఇక, క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 72,462.94 పాయింట్ల దగ్గర భారీ నష్టంతో ప్రారంభమై.. ఆ తర్వాత ఏ దశలోనూ సూచీలు కోలుకోలేదు.. ఇంట్రాడేలో 72,490.09 పాయింట్ల గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్.. ఒక దశలో 71,933.35 పాయింట్ల కనిష్ఠానికి చేరుకుంది. చివరకు 736.38 పాయింట్ల నష్టంతో 72,012.05 దగ్గర స్థిరపడిపోయింది. అలాగే, నిఫ్టీ 238.20 పాయింట్లు నష్టపోయి.. 21,817.50 వద్ద ట్రేడింగ్ ముగిసింది. ట్రేడింగ్‌లో దాదాపు 1202 షేర్లు పెరగ్గా.. 2,458 షేర్లు పతనమైయ్యాయి.
Read Also: Ustaad Bhagath Singh: గ్లాస్ అంటే సైజ్ కాదు.. సైన్యం.. పొలిటికల్ పంచ్ లతో అదరగొట్టిన పవన్
అలాగే, నిఫ్టీలో టీసీఎస్, బీపీసీఎల్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టాటా కన్స్యూమర్, నెస్లే ఇండియా అత్యధికంగా నష్టపోయాయి. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, కోటక్ మహీంద్రా బ్యాంక్, హిందాల్కో ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్‌టెల్ లాభాలను చూశాయి. హెల్త్‌కేర్, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, క్యాపిటల్ గూడ్స్, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్ 1-2 శాతం నష్టాలను చవిచూడటంతో అన్ని రంగాల సూచీలు నష్టాల బాటపట్టాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఒక్కోశాతం చొప్పున నష్టపోయాయి.