JK Cement: ఇటీవల కాలంలో పలు సంస్థలు అత్యుత్తమ ఉద్యోగులకు గిఫ్టులు అందించడం సాధారణంగా మారింది. కార్లు, ఇళ్లు,బోనస్‌లు ఇస్తూ.. ఉద్యోగులకు మరింతగా ఎంకరేజ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ సిమెంట్ కంపెనీ అయిన జేకే సిమెంట్ అత్యుత్తమ డీలర్లకు మహీంద్రా XUV 700 మరియు స్కార్పియోలను అందించింది. దేశవ్యాప్తంగా మంచి పనితీరు కనబరిచిన, కంపెనీ వృద్ధికి సహకారం అందించిన వారికి ఈ బహుమతుల్ని ప్రధానం చేసింది. దేశవ్యాప్తంగా 65 మంది డీలర్లలను గుర్తించింది. వీరందరికి కార్లను అందించింది.
Read Also: Madhya Pradesh: భర్త మేనకోడలిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్న భార్య..
ఇలా ఉద్యోగులను ప్రోత్సహించేందుకు అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయి. 2018లో గుజరాత్ సూరత్‌కి చెందిన బిలియనీర్ వజ్రాల వ్యాపారి సావ్జీ ధోలాకియా తన కంపెనీ సిబ్బందికి 600 కార్లనున గిఫ్టుగా ఇచ్చారు. 2016లో ఉద్యోగులకు దీపావళి బోనస్ కింద 400 ఫ్లాట్లు, 1260 కార్లను అందించారు. 2015లో 491 కార్లు, 200 ఫ్లాట్లను బహుమతులుగా అందించారు. సూరత్‌లోని అలయన్స్ గ్రూప్ 2021లో తన ఉద్యోగులకు ఎలక్ట్రిక్ స్కూటర్లను బహుమతిగా ఇచ్చింది.