Recykal Co-founder: వేస్ట్ అనే పదం వింటే చాలు.. అది దేనికీ పనికిరాదని మనం ముందే డిసైడ్ అయిపోతాం. అందుకే.. చెత్తను మన ఇంటికి దూరంగా విసిరికొడతాం. కానీ.. రీసైకల్ అనే సంస్థ.. వేస్ట్‌కి బెస్ట్ సొల్యూషన్స్ సూచిస్తోంది. వ్యర్థాల నిర్వహణకు కొత్త అర్థాన్ని చెబుతోంది.
Sid’s Dairy Farm: కల్తీ అనే మాట వినగానే మనకు వెంటనే పాలు గుర్తొస్తాయి. అంటే.. మనం నిత్యం వాడే పాలను ఏ స్థాయిలో కల్తీ చేస్తున్నారో దీన్నిబట్టి అర్థంచేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. ప్రజారోగ్యంపై కాటు వేసే ఈ కల్తీ మహమ్మారిని మన దేశం నుంచి పారదోలాల్సిన అవసరం ఉందని కిషోర్ ఇందుకూరి అంటున్నారు.
Robot Man Of India: మనకి రోబో గురించి తెలుసు గానీ రోబో మ్యాన్ ఆఫ్ ఇండియా గురించి తెలియదు. రోబో మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే మన దేశంలో మొట్టమొదటి రోబోను తయారుచేసిన వ్యక్తి కాదు. ఈయన H-Bots అనే కంపెనీ ఫౌండర్-సీఈఓ. పేరు.. పీఎస్‌వీ కిషన్. ఆలిండియా రోబోటిక్స్ అసోసియేషన్‌కి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. H-Bots సంస్థ తొలిసారిగా ఐదేళ్ల కిందట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పోలీస్ రోబోను తయారుచేసింది.
Uma Devi Chigurupati Exclusive Interview: ఉమా దేవి చిగురుపాటి.. విజయవంతమైన మహిళాపారిశ్రామికవేత్త. ప్రతిభావంతురాలైన క్రీడాకారిణి. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును ఒక్కసారి కాదు ఏకంగా రెండు సార్లు సొంతం చేసుకున్నారు. గ్రాన్యూల్స్ ఇండియా అనే సంస్థకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ కంపెనీలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మరియు హ్యూమన్ రిసొర్సెస్ విభాగాలను ముందుండి సమర్థంగా నడిపిస్తున్నారు.