Home
Business News
Business News News
-
RBI: రుణాలు తీసుకున్న వారికి ఊరట.. కీలక వడ్డీరేట్లు యథాతథం
రుణాలు తీసుకున్న వారికి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఊరట కలిగించింది. ఆర్బీఐ వరుసగా పదోసారి కూడా వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ సారథ్యంలోని మానిటీరీ పాలసీ కమిటీ గురువారం నాడు కీలక రెపో, రివర్స్ రెపో రేట్లను యథాతథంగానే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రెపో రేటు 4 శాతంగా వద్దనే ఉంది. రివర్స్ రెపో 3.35 శాతం వద్ద కొనసాగుతోంది. అదేసమయంలో మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు 4.25… -
Petrol Prices: సామాన్యులకు షాక్ తప్పదా? భారీగా పెరగనున్న పెట్రోల్ ధరలు
గత కొన్నిరోజులుగా స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్ ధరలు త్వరలో భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల హడావిడి నడుస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం పెట్రోల్ రేట్లు మరోసారి భారీగా పెరుగుతాయని డెలాయిట్ ఇండియా ఎల్ఎల్పీ అంచనా వేసింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతున్నా.. ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చమురు కంపెనీలు ధరలు… -
సామాన్యుడిపై మరింత భారం.. మళ్లీ పెరిగిన సిమెంట్ ధరలు
సామాన్యులకు సొంతింటి కల మరింత ప్రియం కానుంది. తాజాగా ఏపీ, తెలంగాణలో మరోసారి సిమెంట్ ధరలు పెరిగాయి. ఈనెల 1 నుంచి సిమెంట్ బస్తాపై రూ. 20 నుంచి రూ. 50 వరకు ధర పెంచినట్లు సిమెంట్ కంపెనీలు వెల్లడించాయి. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 50 కిలోల బస్తా ధర బ్రాండ్ ఆధారంగా రూ.310 నుంచి రూ.400 వరకు పలుకుతోంది. సిమెంట్ ధరలు భారీగా పెరుగుతున్న కారణంగా ఇల్లు కట్టుకోవాలంటే పలువురు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.… -
వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్
ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఫీచర్లో వాట్సాప్ కీలక మార్పులు చేయనుంది. ఇందులో భాగంగా టైమ్ లిమిట్‌ను మరింత పెంచనుంది. దీంతో తాము పంపిన మెసేజ్‌లను 60 గంటలు (రెండున్నర రోజులు) తర్వాత కూడా ఇద్దరికీ కనిపించకుండా యూజర్లు డిలీట్ చేయవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ పనితీరును పరిశీలిస్తున్నట్లు వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపింది. Read Also: ఫేక్ న్యూస్..… -
పోస్టాఫీస్ ఖాతాదారులకు గమనిక… డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గింపు
పొదుపు ఖాతాదారులకు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) బ్యాడ్ న్యూస్ అందించింది. ఖాతాదారులు పొదుపు ఖాతాల్లో చేసే జమపై వడ్డీ రేట్లను తగ్గించింది. ప్రస్తుతం అమలు చేస్తున్న వడ్డీ రేట్లపై 25 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు ప్రకటించింది. రూ.1 లక్ష వరకు చేసే డిపాజిట్‌పై 2.25% వడ్డీరేటు, రూ.1 లక్ష-రూ.2 లక్షల వరకు జమ చేసే డిపాజిట్లపై 2.50% వడ్డీ మాత్రమే లభిస్తుంది. కొత్త వడ్డీ రేట్లు ఈనెల 1 నుంచే అమల్లోకి వచ్చినట్లు పోస్టాఫీస్… -
డిజిటల్ కరెన్సీ అంటే ఏంటి? దీని వల్ల కలిగే ఉపయోగమేంటి?
కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో డిజిటల్ కరెన్సీ గురించి ప్రధానంగా ప్రస్తావించింది. త్వరలోనే డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ప్రకటన చేశారు. డిజిటల్ కరెన్సీని సీబీడీసీగా పిలుస్తారు. సీబీడీసీ అంటే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. ఇది పూర్తిగా డిజిటల్ రూపంలోనే ఉంటుంది. డిజిటల్ కరెన్సీ రాకతో ఇప్పటివరకు నగదు వినియోగంపై ఆధారపడిన ప్రస్తుత వ్యవస్థ విప్లవాత్మక మార్పులకు లోనయ్యే అవకాశం ఉంది. వినియోగదారులు పేమెంట్లు చేయడానికి… -
కేంద్ర బడ్జెట్ 2022: ధరలు పెరిగేవి? తగ్గేవి?
కేంద్ర ప్రభుత్వం మంగళవారం నాడు బడ్జెట్-2022ను ఆవిష్కరించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్ ప్రకారం కొన్ని వస్తువుల ధరలు పెరగనున్నాయి. అలాగే కొన్ని వస్తువుల ధరలు తగ్గనున్నాయి. కొన్నింటిపై కస్టమ్ సుంకం తగ్గించగా.. కొన్నింటిపై కస్టమ్ సుంకం పెంచారు. అందువల్ల ధరల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ధరలు తగ్గే వస్తువుల జాబితా: మొబైల్ ఫోన్లు, మొబైల్ ఫోన్ ఛార్జర్లు, మొబైల్ ఫోన్ ఛార్జింగ్ ట్రాన్స్ఫార్మర్లు, వజ్రాలు,… -
సామాన్యులకు షాక్.. మళ్లీ పెరగనున్న వంటనూనెల ధరలు
రెండేళ్లుగా పెరుగుతున్న వంటనూనెల ధరలు ఇటీవల స్వల్పంగా తగ్గి పేదలకు ఊరట కలిగించాయి. అయితే ప్రస్తుతం దేశంలో నూనె పంటలు తగ్గడంతో వంట నూనెలకు మళ్లీ డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సామాన్యుడికి మళ్లీ షాక్ తగలనుంది. మరోసారి వంట నూనెల ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఇండోనేషియా. భారత్‌కు ఎక్కువగా వంటనూనెలు ఇండోనేషియా నుంచే దిగుమతి అవుతున్నాయి. భవిష్యత్‌లో ఎగుమతులు తగ్గించుకోవాలని ఇండోనేషియా భావిస్తోంది. ఈ నిర్ణయం కారణంగా ఇండియాకు వంట… -
మగువలకు గుడ్‌న్యూస్.. మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు
మన దేశంలో బంగారానికి డిమాండ్ విపరీతంగా ఉంటుంది. ఇంట్లో ఏ శుభకార్యం తలపెట్టినా మహిళలు బంగారం కొంటుంటారు. బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు అత్యంత ఆసక్తిని చూపిస్తారు. కరోనా ప్రారంభమైన నాటి నుంచి బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఇటీవల పసిడి ధర మరోసారి రూ.50వేలు కూడా దాటింది. అయితే కొన్నిరోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఆదివారం కూడా పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. Read Also: కార్ల అమ్మకాల్లో కొత్త రికార్డు.. ఏడాదిలో కోటిపైగా… -
ఎయిర్‌టెల్‌లో గూగుల్ భారీ పెట్టుబడులు
ప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌లో గూగుల్ భారీస్థాయిలో పెట్టుబడులు పెట్టనుంది. రానున్న ఐదేళ్ల కాలంలో ఎయిర్‌టెల్‌లో గూగుల్ సంస్థ రూ.7,400 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎయిర్‌టెల్‌లో 1.28 శాతం యాజమాన్య హక్కులను కొనుగోలు చేసేందుకు గూగుల్ ఆసక్తి చూపిస్తోంది. మరో 300 మిలియన్ డాలర్ల మేర ఎయిర్ టెల్‌తో వాణిజ్య లావాదేవీలను గూగుల్ కుదుర్చుకోనుంది. Read Also: మొబైల్ ప్రీపెయిడ్ కస్టమర్లకు ట్రాయ్ గుడ్ న్యూస్ కాగా 5G నెట్వర్క్, తక్కువ ధరకు…
తాజావార్తలు
-
Sai Pallavi in Kalki 2: కల్కి 2లో దీపికా పదుకొనే స్థానంలో సాయి పల్లవి..?
-
CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్‌తోనే పోటిపడుతున్నాం..
-
Harassment: గురూజీ వలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి భార్య.. అంతా చాటింగ్‌ల ద్వారానే..
-
AP Municipal Elections 2026: సీట్ల సర్దుబాటుపై ఎన్డీఏ కీలక భేటీ.. 40 శాతం వాటా కోరుతున్న జనసేన!
-
The Raja Saab : సంక్రాంతి విలన్.. రాజా సాబ్ పోస్ట్ మార్టం ఫెయిల్?
ట్రెండింగ్
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!