ఈ ఏడాదిని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగించాయి. ఈరోజు ఉదయమే లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ చివరకు లాభాలతోనే ముగించడం విశేషం. సెన్సెక్స్ 459.5 పాయింట్ల లాభంతో 58,253 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ 150 పాయింట్లు లాభపడి 17,354 పాయింట్ల వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లో టైటాన్, ఆల్ట్రాటెక్ సిమెంట్స్, కొటక్ మహింద్రా బ్యాంక్, మారుతి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థల షేర్లు లాభపడ్డాయి. ఎన్టీపీసీ, టెక్ మహింద్రా, పవర్ గ్రిడ్, డాక్టర్ రెడ్డీస్ సంస్థల షేర్లు మాత్రం నష్టపోయాయి.
Read Also: పెరిగిన విజయ పాల ధర.. లీటరుపై రూ.2 పెంపు
వస్త్ర పరిశ్రమలో జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వాయిదా వేయడంతో టెక్స్‌టైల్ రంగంలోని రేమండ్స్, ట్రైడెంట్ వంటి కంపెనీల షేర్లు లాభపడినట్లు ట్రేడ్ విశ్లేషకులు వెల్లడించారు. మరోవైపు హెచ్‌సీఎల్ కంపెనీ షేర్లు వరుసగా 9వ రోజూ లాభపడ్డాయి. గత 20 ఏళ్లలో ఆ కంపెనీ షేర్లు వరుసగా 9 రోజులు లాభపడటం ఇదే తొలిసారి కావడం విశేషం. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.74.33 వద్ద ట్రేడవుతోంది.