ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి డిసెంబరు మాసంలో అమ్మకాల జోరును చూపించలేకపోయింది. అమ్మకాల పరంగాచూస్తే, 2021 డిసెంబరులో మారుతి సుజుకి కార్ల అమ్మకాల్లో 4 శాతం క్షీణత కనిపించింది. కిందటి నెలలో మారుతి 1,53,149 వాహనాలు విక్రయించింది. 2020 డిసెంబరులో మారుతి సంస్థ 1,60,226 కార్లు విక్రయించింది. 2021 నవంబరులో 1,39,184 కార్లు విక్రయించినట్టు తాజా ప్రకటనలో మారుతి సంస్థ వెల్లడించింది.
Read Also:సర్కార్‌ను మేల్కొల్పడమే జాగరణ లక్ష్యం: బండిసంజయ్
డిసెంబరులో అమ్మకాలు కాస్త పుంజుకున్నప్పటికీ గతేడాది డిసెంబరుతో పోల్చి చూస్తే తక్కువే. వాహన ఉత్పాదక రంగంపై ఎలక్ట్రానిక్ పరికరాల కొరత తీవ్రస్థాయిలో ఉందని మారుతి సుజుకి సంస్థ పేర్కొంది. ప్రధానంగా చిప్ సెట్ల కొరత వాహన తయారీ రంగాన్ని కుదుపులకు గురిచేస్తోంది. మారుతి సుజుకి మాత్రమే కాదు, ఇతర వాహన ఉత్పత్తిదారులను కూడా ఈ సమస్య వేధిస్తోంది. దీంతో ఏడాది చివరి అమ్మకాలు మందగించాయి. ఇవే కాకుండా కోవిడ్, ఒమిక్రాన్ ఎఫెక్టు కూడా అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపించిందని మారుతీ సుజుకి సంస్థ వెల్లడించింది. దీంతో డిసెంబర్‌లో ఎక్కువ సేల్స్ చేయలేకపోయామని సంస్థ వర్గాలు పేర్కొన్నాయి.