జనసేన అధినేత పవన్ కల్యాణ్ త్వరలోనే యాత్ర చేపట్టబోతున్నారు.. పవన్ బస్సు యాత్రకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. పవన్ కోసం ప్రత్యేకంగా బస్సు తయారైంది.. దీనికి తుది మెరుగులు దిద్దుతున్నారు.. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా తయారు చేస్తున్న ఈ బస్సు.. ఎన్టీఆర్ చైతన్య రధాన్ని పోలి ఉంది. ఇప్పటి వరకూ బస్సు యాత్ర చేసిన వివిధ పార్టీలు నేతలు వాడిన బస్సులకు భిన్నంగా ఈ బస్సును డిజైన్ చేశారు. రెగ్యులర్ బస్సులు, లారీలకు వాడే పెద్ద టైర్లు దీనికి…
ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయని జనసేన పార్టీ అభిప్రాయపడుతోంది. వచ్చే ఏడాది మార్చిలోనే ఎన్నికలు జరుగుతాయని అంచనా వేస్తోంది. దీంతో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లేందుకు పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర చేపట్టనున్నారు. అక్టోబర్ నుంచి ఆయన బస్సు యాత్రను ప్రారంభిస్తారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. విజయదశమి సందర్భంగా అక్టోబర్ 5 నుంచి పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర…
వైసీపీ చేపట్టిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర అనంతపురం చేరుకుంది. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై మంత్రి గుమ్మనూరు జయరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. గుడిని, గుడిలో లింగాన్ని మింగుతున్నారని బాలకృష్ణ ఆరోపిస్తున్నారని.. ఆయన్ను వచ్చే ఎన్నికల్లో హిందూపురంలో ఓడించి తీరుతామని మంత్రి గుమ్మనూరు జయరాం స్పష్టం చేశారు. మీసం మెలేసి చెబుతున్నా.. బాలయ్య తాట తీస్తామని ఆయన వ్యాఖ్యానించారు. బీసీలంతా కలిసి బాలయ్య పనిపడతారని.. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని మంత్రి గుమ్మనూరు…
ఒంగోలులో టీడీపీ మహానాడు భారీస్థాయిలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ మహానాడుపై మంత్రి గుమ్మనూరు జయరాం విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు వయసు అయిపోయిందని.. ఆయనకు మతి భ్రమించిందని ఎన్టీవీతో మాట్లాడుతూ ఆరోపించారు. వరుణ దేవుడి ఆశీస్సులు రాజశేఖర్ కుటుంబానికి ఉంటాయని చెప్పటానికి కురుస్తున్న వర్షాలే ప్రత్యక్ష ఉదాహరణ అని మంత్రి జయరాం అభిప్రాయపడ్డారు. వైసీపీ చేపట్టిన సామాజిక న్యాయభేరీ బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అన్ని వర్గాలకు పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా సీఎం…
ఏపీ మంత్రులు తలపెట్టిన సామాజిక న్యాయభేరీ బస్సు యాత్ర రెండో రోజు కొనసాగుతోంది. విశాఖ పాత గాజువాక వైఎస్ఆర్ విగ్రహం నుంచి బస్సు యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం అమలాపురం అల్లర్లపై స్పందించారు. ఏపీలో ప్రతిపక్షాలు కావాలనే అల్లర్లు సృష్టిస్తున్నాయని స్పీకర్ తమ్మినేని ఆరోపించారు. టీడీపీ వాళ్లు చేసేది మహానాడు కాదు వల్లకాడు అని ఆరోపించారు. రాష్ట్రంలో టీడీపీ పని అయిపోయిందని తమ్మినేని సీతారాం అభిప్రాయపడ్డారు. చచ్చిన పార్టీకి ప్రజలు దహన సంస్కారాలు…
వైసీపీ మంత్రులు ప్రారంభించిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్రం రెండోరోజుకు చేరుకుంది. విశాఖలోని పాత గాజువాక జంక్షన్ నుంచి రెండో రోజు బస్సు యాత్ర ప్రారంభమైంది. ఈ మేరకు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రులు బస్సు యాత్రను ప్రారంభించారు. రెండో రోజు విశాఖ, తూ.గో. జిల్లాలలో సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర జరగనుంది. లంకాలపాలెం జంక్షన్, అనకాపల్లి బైపాస్, తాళ్లపాలెం జంక్షన్, యలమంచిలి వై రోడ్డు జంక్షన్, నక్కపల్లి, తుని, అన్నవరం, జగ్గంపేట మీదుగా ఈ…
వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన సామాజిక న్యాయభేరీ యాత్ర గురువారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా నుంచి విజయనగరం జిల్లాకు చేరుకుంది. ఈ మేరకు విజయనగరం జిల్లాలో పైడి భీమవరం నుంచి వైసీపీ మంత్రుల సామాజిక న్యాయభేరీ యాత్ర ప్రారంభమైంది. నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి వైసీపీ నేతల బస్సు యాత్ర వలస గ్రామం చేరుకుంది. అక్కడ బహిరంగసభ అనంతరం మంత్రుల బస్సు యాత్ర విజయనగరం పట్టణంలోకి ప్రవేశించనుంది. ఈ సందర్భంగా విజయనగరంలో ప్యూమా జంక్షన్ వద్ద ఏర్పాటు చేసినభారీ బహిరంగ…
ఏపీలో ఈనెల 26 నుంచి 29 వరకు వైసీపీ మంత్రులు బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఈ మేరకు గురువారం నాడు మంత్రులు బొత్స, ధర్మాన, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మేరుగ నాగార్జున బస్సు యాత్ర పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. సామాజిక న్యాయ భేరీ పేరుతో బస్సు యాత్రను చేపడుతున్నామని వెల్లడించారు. ఈ నెల 26 నుంచి 29 వరకు నాలుగు రోజుల పాటు వరుసగా నాలుగు బహిరంగ సభలు నిర్వహించాలని…