జనసేన అధినేత పవన్ కల్యాణ్ త్వరలోనే యాత్ర చేపట్టబోతున్నారు.. పవన్ బస్సు యాత్రకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. పవన్ కోసం ప్రత్యేకంగా బస్సు తయారైంది.. దీనికి తుది మెరుగులు దిద్దుతున్నారు.. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా తయారు చేస్తున్న ఈ బస్సు.. ఎన్టీఆర్ చైతన్య రధాన్ని పోలి ఉంది. ఇప్పటి వరకూ బస్సు యాత్ర చేసిన వివిధ పార్టీలు నేతలు వాడిన బస్సులకు భిన్నంగా ఈ బస్సును డిజైన్ చేశారు. రెగ్యులర్ బస్సులు, లారీలకు వాడే పెద్ద టైర్లు దీనికి వాడారు. వర్క్ షాపులో తయారు అవుతున్న ఈ బస్సుకు సంబంధించిన ఫొటోలు ఇప్పటికే బయటకు వచ్చి.. సోషల్ మీడియాలో రచ్చ చేశాయి.. అయితే.. ఈ ప్రత్యేక బస్సు హంగులు తుది దశకు చేరుకున్నాయి.. ఈ నేపథ్యంలో ఇవాళ ఆ ప్రత్యేక వాహనాన్ని పరిశీలించారు జనసేనాని.. బస్సును పరిశీలించి.. కొన్ని సూచనలు చేసినట్టుగా తెలుస్తోంది.
Read Also: Pawan Kalyan Vizag Tour: జనసేనాని విశాఖ టూర్ షెడ్యూల్ ఇదే.. ‘విశాఖ గర్జన’తో టెన్షన్..!
ఇక, ఈ బస్సుకు ప్రత్యేకంగా సౌండ్ సిస్టం ఏర్పాటు చేస్తున్నారు.. అంతేకాదు.. ఎంత దూరంలో ఉన్న.. వారికి పవన్ కల్యాణ్ కనిపించేలా బస్ టాప్ ఏర్పాటు చేస్తున్నారు.. ఆ యాత్ర జరిగినన్ని రోజులు పవన్ కల్యాణ్ అందులోనే ఉండనున్న నేపథ్యంలో.. ఆయన అలవాట్లు, అవసరాలకు తగ్గట్టుగా అందులో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు.. అయితే, మొదట అక్టోబర్ మొదటివారం నుంచే ఆ యాత్ర ప్రారంభించాలని భావించారు.. కానీ, బస్సు యాత్ర వాయిదా వేస్తున్నట్లు ఈ మధ్యే పవన్ ప్రకటించారు. అయితే, నియోజకవర్గాలవారీగా సమీక్షలు నిర్వహించనున్నట్లు జనసేనాని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 45-67 సీట్లే రాబోతున్నాయని, జనవాణిలో వచ్చిన ఆర్జీలను కూడా ఆధ్యయనం చేస్తున్నామన్నారు. సమస్యలపై అధ్యయనం జరుగుతుందని.. అధ్యయనం పూర్తయ్యాక బస్సు యాత్ర ఉంటుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే..