ఎల్లుండి (బుధవారం) నుంచి సీఎం వైఎస్ జగన్ బస్సుయాత్ర చేపట్టనున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 'మేమంతా సిద్ధం' పేరుతో రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర నిర్వహించనున్నారు. ఈ బస్సు యాత్ర ఇడుపులపాయ నుంచి మొదలై ఇచ్చాపురం వరకు సాగనుంది. ఈ నెల 27న ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఘాట్ వద్ద ప్రార్ధనలు చేసిన అనంతరం మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభించనున్నారు.
ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించేందుకు సిద్ధమైంది. ఎన్నికల తేదీ ఆలస్యమవడంతో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘మేమంతా సిద్ధం’ పేరుతో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రను చేపట్టబోతున్నారు.
Shabarimala: అయ్యప్ప భక్తులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభవార్త అందించింది. అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.
తెలంగాణలో రాహుల్ గాంధీ బస్సు యాత్రలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. నిజామాబాద్‌లో రేపు సాయంత్రం జరగాల్సిన పాదయత్ర క్యాన్సిల్ అయింది. రేపు ఆర్మూరులో పసుపు, చెరుకు రైతులతో ముఖాముఖీ సమావేశం అవుతారు.
ఈనెల 26 నుంచి ఉత్తరాంధ్రలో మొదటి దశ బస్సు యాత్రకు వైఎస్సార్‌సీపీ శ్రీకారం చుట్టనుంది. ఈ యాత్రకు సంబంధించిన షెడ్యూల్‌ను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. 13రోజుల పాటు ఉత్తరాంధ్రలో సామాజిక న్యాయ బస్సు యాత్ర జరగనుందని మంత్రి వెల్లడించారు.
అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సామాజిక న్యాయ యాత్ర పేరిట చేపట్టనున్న బస్సుయాత్రను విజయవంతం చేయడానికి ప్రాంతాల వారీగా బాధ్యులను నియమించారు.
అనంతపురం జిల్లాలో భవిష్యత్తుకు గ్యారెంటీ బస్సు యాత్ర సాక్షిగా టీడీపీలో విభేధాలు రచ్చకెక్కుతున్నాయి. పెనుకొండలో తెలుగు తమ్ముళ్లు ఒకరిని ఒకరు కొట్టుకోగా, మడకశిర ఏకంగా యాత్రనే వాయిదా వేయించారు.
కర్ణాటకలో ఎన్నికల వేడి మొదలైంది. 2023 ఎన్నికలే లక్ష్యంగా కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. అధికారంలోని బీజేపీని గద్దె దించాలని నిర్ణయించుకుని బస్సు యాత్రను ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించనుంది. రేపు బెలగావిలో అధికారికంగా ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.