KCR: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో రాష్ట్రంలోని జాతీయ పార్టీల నేతలతో కలిసి ప్రచారం నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తనపై జరిగిన దాడి తర్వాత మళ్లీ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎన్నికల నేపథంలో భాగంగా మళ్లీ ఎన్నికల ప్రచార పర్వాన్ని మొదలుపెట్టబోతున్నారు సీఎం. శనివారం నాడు జరిగిన దాడిలో సీఎం జగన్ పై ఓ గుతూ తెలియని ఆగంతకుడు రాయి విసిరిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఆయనకు కంటి పై భాగంలో చిన్నపాటి గాయం కారణంగా నేడు విశ్రాంతి తీసుకున్నారు. దాంతో నేడు బస్సు యాత్రకు విరామం ప్రకటించారు…
గుంటూరు జిల్లాలోని తాడేపల్లికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేమంత సిద్ధం బస్సు యాత్ర చేసుకుంది. ఈ సందర్భంగా జగన్ బస్సుయాత్రలో అరుదైన దృశ్యం నెలకొంది. తాడేపల్లి జంక్షన్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సు యాత్రకు ఆయన సతీమణి వైఎస్ భారతి సంఘీభావం తెలిపారు.
ఏపీలో సీఎం జగన్ చేపట్టిన 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర ఐదో రోజు దిగ్వజయంగా కొనసాగింది. ఈ యాత్రలో భాగంగా సీఎం యాత్ర కదిరికి చేరింది. ఈ నేపథ్యంలోనే రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరుల కోసం కదిరిలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోన్న తరుణంలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. కదిరి మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా కదిరి వచ్చిన సీఎం జగన్.. పార్టీ కండువా కప్పి చాంద్ బాషాను పార్టీలోకి ఆహ్వానించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర నాలుగో రోజు కొనసాగుతోంది. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దారిపొడవునా జై జగన్ నినాదాలతో యాత్ర మార్మోగుతోంది.
ఓ వైపు జోరుగా ఎన్నికల ప్రచారం.. మరో వైపు చేరికలతో ఉత్సాహంగా సాగుతోంది మేమంతా సిద్ధం బస్సు యాత్ర. నాలుగో రోజు కర్నూలు జిల్లాలో బస్సు ఉత్సాహం కొనసాగింది. బస్సు యాత్ర సందర్భంగా పలువురు కళ్యాణదుర్గం టీడీపీ నేతలు, కార్యకర్తలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.
ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర ప్రారంభమైంది. ఇడుపులపాయ నుంచి ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తాడేపల్లి నుంచి ఇడుపులపాయకు చేరుకున్న ముఖ్యమంత్రి జగన్... తన తండ్రి సమాధి వైఎస్ ఘాట్ వద్ద సర్వమత ప్రార్థనలను నిర్వహించారు.