Andhra Pradesh: బస్సు యాత్ర పోస్టర్‌ను విడుదల చేసిన మంత్రులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ఈనెల 26 నుంచి 29 వరకు వైసీపీ మంత్రులు బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఈ మేరకు గురువారం నాడు మంత్రులు బొత్స, ధర్మాన, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మేరుగ నాగార్జున బస్సు యాత్ర పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. సామాజిక న్యాయ భేరీ పేరుతో బస్సు యాత్రను చేపడుతున్నామని వెల్లడించారు. ఈ నెల 26 నుంచి 29 వరకు నాలుగు రోజుల పాటు వరుసగా నాలుగు బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. బస్సు యాత్ర శ్రీకాకుళం నుంచి ప్రారంభమై అనంతపురంలో ముగుస్తుందన్నారు.
బస్సు యాత్రలో 17 మంది మంత్రులతో పాటు వైసీపీకి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజాప్రతినిధులు పాల్గొంటారని మంత్రి ధర్మాన వెల్లడించారు. పాలన చేసే వారుగా ఎప్పుడు మారతాం అన్న ఆవేదన ఈ నాలుగు వర్గాల్లో ఉందని.. వీరి ఆత్మ ఘోషణను నివారించడానికి వైసీపీ కంకణం కట్టుకుందని తెలిపారు. గతంలో బలహీన వర్గాలకు మంత్రి పదవి ఇస్తే చాలా గొప్ప విషయంగా భావించే వారు అని.. వెనుకబడిన వర్గాల వారు మంత్రి పదవులు పొందడానికి అర్హులు కారనే భావజాలం ఉండేదని.. కానీ ప్రస్తుత కేబినెట్‌లో 77 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారే ఉండటం గమనించాల్సిన విషయమని మంత్రి ధర్మాన అన్నారు. దేశ చరిత్రలో ఎప్పుడైనా ఇలా జరిగిందా అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో బలహీన వర్గాలకు ఒక రాజ్యసభ స్థానం ఇచ్చిన దాఖలాలు కూడా లేవని.. కానీ టీడీపీ వాళ్లు మాత్రం ముఖ్యమంత్రి పదవి ఇచ్చేయాలని డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
Also Read
- Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
- AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
- APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
- CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
Somu Veerraju: ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై విచారణ జరిపించాలి
అటే ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేయలేదని చెప్పి నమ్మించాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని మంత్రి ధర్మాన విమర్శించారు. వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకెళ్లడానికే తాము బస్సు యాత్ర చేస్తున్నట్లు చెప్పారు. రాజ్యసభకు ఆర్ కృష్ణయ్యను ఎంపిక చేస్తే తెలంగాణ వ్యక్తి అంటున్నారని… చంద్రబాబు ఎక్కడ ఉంటున్నారో చెప్పాలని మంత్రి ధర్మాన సూటిగా ప్రశ్నించారు. ప్రాంతం ముఖ్యం కాదని.. బీసీ వర్గాలకు ఆర్.కృష్ణయ్య చేసిన కృషిని గుర్తించామని తెలిపారు. 77 శాతం బీసీలకు మంత్రివర్గంలో చోటు కల్పించామని మంత్రి ధర్మాన గుర్తుచేశారు.
తాజావార్తలు
-
Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
-
Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
-
Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
-
Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
-
Varanasi Release Date: ఏప్రిల్ 7న ‘వారణాసి’ వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
ట్రెండింగ్
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?